షర్మిలకు రాజ్యసీటు సీటు అడ్డుకుందెవరు, చివరి నిమిషంలో..!!

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కలేదు. ఈ సారి ఖాయమని భావించారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ తో నూ భేటీ అయ్యారు. కర్ణాటక నుంచి షర్మిలకు అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్దుల జాబితాలో షర్మిల పేరు లేదు. కాంగ్రెస్ నాయకత్వం సైతం కర్ణాటక నుంచి షర్మిలకు సీటు ఇవ్వాలని తొలుత భావించారు. అయితే, చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాలతో షర్మిలకు సీటు దక్కలేదు. దీని వెనుక పలు ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల ఈ సారి రాజ్యసభ సీటు వస్తుందని అశలు పెట్టుకున్నారు. తనకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభకు అవకాశం కల్పించాంటూ ఇటీవల షర్మిల భర్త అనిల్ తో కలిసి హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జునఖర్గేతో భేటీ అయ్యారు. పార్టీలో చేరే సమయంలోనూ రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ లోకి షర్మిలను తీసుకురావడంలో అప్పటి కర్ణాటక పీసీసీ చీఫ్ ప్రస్తుత సీఎం డీకే శివకుమార్ కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన కర్ణాటక సీఎం కావటం తో ఇక షర్మిలకు ఖచ్చితంగా రాజ్యసభ సీటు దక్కుతుందని భావించారు. అయితే, కాంగ్రెస్ ముగ్గురు సీనియర్లకు కర్ణాటక నుంచి అవకాశం కల్పించింది. షర్మిల పేరు పక్కన పెట్టింది. ఇదే అంశం పైన కాంగ్రెస్ ముఖ్య నేత షర్మిల తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మారుతున్న సమీకరణాలతో సీటు ఇవ్వలేమని.. మరో విడత లో అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం.

జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధి ఫిక్స్, పవన్ అనూహ్య ఎంపిక..!!
జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధి ఫిక్స్, పవన్ అనూహ్య ఎంపిక..!!
congress-denied-rajyasabha-seat-for-pcc-chief-ys-shramila-why-here-the-reasons

కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం వెనుక

కాగా.. షర్మిలకు సీటు విషయంలో ఢిల్లీ కేంద్రంగా కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత సాంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీ కంటే అన్న ను విమర్శించేందుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. షర్మిలకు పెద్దల సభలో సీటు అంశం చర్చకు వచ్చిన తరువాత ఏపీకి చెందిన కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. తమిళనాడు ప్రభుత్వం లో బాగస్వామిగా ఉండటంతో పాటుగా కేరళ, కర్ణాటక, తెలంగాణలో సొంత ప్రభుత్వాలు ఉన్నాయి. ఏపీలో మాత్రం పార్టీ భవిష్యత్ అంతు చిక్కటం లేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో.. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరున్న డీకే కర్ణాటక సీఎం కావటంతో కాంగ్రెస్ ఏపీ కేంద్రంగా కొత్త వ్యూహాల అమలుకు సిద్దమైంది. అందులో భాగంగానే షర్మిలకు రాజ్యసభ స్థానం ఇవ్వలేదని పార్టీలో చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+