టిలో కాంగ్రెస్సే, సీమాంధ్రలో జీరో: జగన్‌పై బాబు పైచేయి
హైదరాబాద్: మున్సిపల్ ఫలితాలు సీమాంధ్రలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వైపు కనిపిస్తుండగా, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ హవా కనిపిస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ జీరోగా మారిపోయింది. సీమాంధ్రలో 92 మున్సిపాలిటీలు ఉండగా అత్యధిక స్థానాల్లో సైకిల్ విజయం సాధించింది.
టిడిపి 64 స్థానాల్లో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించాయి. 9 స్థానాల్లో హంగ్ రానుంది. కాంగ్రెసు పార్టీ మాత్రం ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ హవా కనిపించింది.

తెలంగాణ రాష్ట్ర సమితి ముందంజలో ఉంటుందని భావించినప్పటికీ కాంగ్రెసు పార్టీ జోరు కనిపించింది. తెలంగాణలో 53 మున్సిపాలిటీలు ఉండగా.. 23 మున్సిపాలిటీలను కాంగ్రెసు గెలుచుకుంది.
తెరాస 11, టిడిపి, 4, ఇతరులు 16 స్థానాల్లో విజయం సాధించారు. విభజన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ జోరు కనిపించలేదు. సీమాంధ్రలో మాత్రం ఖాతా తెరువలేకపోయింది.
మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం విజయ పతాకం ఎగురవేస్తుండటంపై ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. పలు డివిజన్లలో పార్టీ గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులో కూడా ఇదే తరహా ఫలితాలు వస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications