YS Sharmila: వైఎస్ షర్మిల ఢిల్లీ హంగామా వెనుక హైకమాండ్ టార్గెట్ ఇదేనా ?

ఏపీలో గత ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై కేంద్రం మెడలు వంచుతానంటూ వైసీపీ అధినేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే జనం 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ ప్రత్యేక హోదా మాత్రం రాలేదు. అంతే కాదు విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో అదే అంశాన్ని పట్టుకుని ఇప్పుడు ఆయన సోదరి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీలో రోడ్డెక్కారు.

ఏపీకి విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలంటూ ఢిల్లీలో ఇవాళ జాతీయ పార్టీల నేతల్ని కలిసిన వైఎస్ షర్మిల.. అనంతరం ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆమె ధర్నా చేపట్టారు. దీనికి ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మద్దతు పలికారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేర్చాలని షర్మిల ఒత్తిడి పెంచుతున్నారు. అయితే దీని వెనుక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఉంది.

congress high commands mp seats target behind ys sharmilas delhi fight on special status

ఏపీలో ప్రస్తుత పరిస్దితుల్లో అసెంబ్లీకి పోటీ చేసి అభ్యర్ధుల్ని గెలిపించుకోవడం కష్టమే. పలు చోట్ల అభ్యర్ధులు దొరికినా వారి గెలుపుపై మాత్రం గ్యారంటీ లేదు. అయితే ఎంపీ అభ్యర్ధుల్ని నిలబెడితే జాతీయ స్ధాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కు కాస్తో కూస్తో ఆదరణ దక్కే అవకాశం ఉంది. గెలుపు గ్యారంటీ ఉన్నా లేకపోయినా ఎంపీలుగా ఏపీ కాంగ్రెస్ లో కాస్తో కూస్తో బలమున్న నేతలు బరిలోకి దిగితే ఆ ప్రభావం కచ్చితంగా వైసీపీ అవకాశాలపై పడుతుంది.

ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన తరఫున ఎంపీ అభ్యర్ధులు బరిలోకి దిగుతున్నారు. వీరిలో ఎవరు గెలిచినా అంతిమగా బీజేపీ గెలిచినట్లేనని కాంగ్రెస్ ప్రచారం చేయబోతోంది. ఇప్పటికే బీజేపీ టార్గెట్ గా షర్మిల విమర్శలకు దిగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధుల్ని గెలిపించాలని షర్మిలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు కూడా ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+