సీఎం జగన్ పై కేవీపీ కొత్త అస్త్రం: చంద్రబాబు - పవన్ చేయలేనిది..!?
ముఖ్యమంత్రి జగన్ పైన కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ కు ఆప్తమిత్రుడైన కేవీపీ ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ తరువాత జగన్ పాలన పైన ఎక్కడా ఎటువంటి విమర్శలు చేయలేదు. వైఎస్సార్ జయంతి..వర్దంతి వేడుకలకు మాత్రం హాజరయ్యే వారు. ఇప్పుడు ఏపీ పీసీసీ కొత్త కమిటీలో కేవీపీకి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ సమావేశంలో ఏపీలో పాలనా పరమైన లోపాల గురించి కేవీపీ ప్రస్తావించారు. ప్రధానంగా పోలవరం.. ప్రత్యేక హోదా అంశం పైన స్పందించారు. ప్రత్యేక హోదా పైన చంద్రబాబు - పవన్ ప్రస్తావించటం లేదు. ఇప్పుడు కేవీపీ ఇదే అంశాల పైన వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు తరహాలోనే జగన్ అంటూ...
ఏపీ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో కేవీపీ రామచంద్ర రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి పోలవరం..ప్రత్యేక హోదా అవసరం గురించి వివరించారు. కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేయాల్సి ఉంటే అటు కేంద్రం..ఇటు రాష్ట్రం ప్రాజెక్టు విషయంలో సరైన వైఖరితో లేవని విమర్శించారు. పోలవరం నిర్వాసితులు నాలుగున్నర లక్షల మందికి జగన్ దారి చూపడం లేదని, కనీసం ప్రోత్సాహకాలు అందించలేని హీన, దీనస్థితిలో ఉన్నారని కేవీపీ అసహనం వ్యక్తం చేశారు. అంచనాలు ఎంతైనా కేంద్రమే పోలవరం పూర్తి చేయాలని కేవీపీ డిమాండ్ చేసారు. ప్రత్యేక హోదా విషయంలో గతంలో చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రశ్నించటం లేదని కేవీపీ ఆక్షేపించారు. ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రానికి కాంగ్రెస్ అవసరాన్ని వివరించాలని సూచించారు.

చంద్రబాబు - పవన్ ప్రశ్నించలేరు
ఏపీకి ప్రత్యేక హోదా గురించి టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ ప్రశ్నించలేరు. చంద్రబాబు బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. జనసేన ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. చంద్రబాబు హాయంలోనే హోదా స్థానంలో ప్యాకేజీకి అంగీకరించారనే అంశం పైన పలు మార్లు చర్చ జరిగింది. 2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించిన అంశాన్ని జగన్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధానిని కలిసిన ప్రతీ సందర్బంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని తన వినతి పత్రం లో చేరుస్తున్నారు. అటు కేంద్రం పార్లమెంట్ వేదికగా ఇప్పటికే పలు మార్లు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నేత కేవీపీ ఇదే అస్త్రాన్ని తెర మీదకు తెచ్చారు.

గతంలోనూ ఏపీలో పాలనపై..
కొద్ది రోజుల క్రితం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ కేవీపీ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఏపీలో ప్రస్తుత పాలన సరైన దిశలో సాగటం లేదని అభిప్రాయపడ్డారు. విభజన హామీల కోసం ప్రభుత్వం నుంచి పోరాటం లేదని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన విధానంలో వెళ్లటం లేదని కేవీపీ చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం సిద్దపడిందన్నారు. అయినా, అడ్డుకొనే ప్రయత్నాలు జరగటం లేదని ఆవేనద వ్యక్తం చేసారు. నాడు వైఎస్సార్ రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని గుర్తు చేసారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం, రాహుల్ ను ప్రధాని చేయటం ఆ రెండు లక్ష్యాలుగా కేవీపీ గుర్తు చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే 2024 లో కాకపోయినా..2029 నాటికికైనా కాంగ్రెస్ తన సత్తా చాటుతుందని కేవీపీ చెప్పుకొచ్చారు.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!











Click it and Unblock the Notifications