పులివెందులలో జగన్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం పోరార హోరీగా మారుతోంది. రెండు కూటములు జగన్ ఓటమి లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగాయి. జగన్ సొంత జిల్లా కడపలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే జగన్ సోదరి షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. పులివెందుల నుంచి జగన్ పైన కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఆ పార్టీ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Congress likely to field sowbhagyama against YS Jagan from pulivendula

ఈసారి ఎన్నికల్లో కడప జిల్లాలో జరుగుతున్న పోరాటం రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది. కడప జిల్లాలో 2019లో గెలిచిన అభ్యర్థులని జగన్ తిరిగి తన అభ్యర్థులుగా ప్రకటించారు. వివేకా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ మూడోసారి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. అవినాష్ పైన కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ షర్మిల పోటీకి దిగారు. షర్మిల కు మద్దతుగా వివేకా కుమార్తె సునీత ప్రచారంలో పాల్గొంటున్నారు. అవినాష్ తో పాటు సీఎం జగన్ ని సైతం టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో కడప నుంచి టిడిపి అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. మారుతున్న సీట్లలో భాగంగా కడప ఎంపీ సీటు బిజెపి నుంచి ఆదినారాయణ రెడ్డికి ఖరార్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలోనే పులివెందుల అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

Congress likely to field sowbhagyama against YS Jagan from pulivendula

కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ స్థానంలో దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబమే రాజ్యమేలుతుంది. జగన్ ఇప్పటికే అక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి అక్కడినుండి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వైయస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండటంతో పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ పోటీ చేయటం ద్వారా రాజకీయంగా కొంతమేర కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తొలుత ఎంపిగా సౌభాగ్యమ్మ పేరు చర్చకు వచ్చింది. అయితే షర్మిల ఎంపీగా బరిలోకి దిగాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దీంతో ఇప్పుడు పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. దీంతో కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ కుటుంబం నుంచే కాంగ్రెస్, వైసీపీ నుంచి అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. దీంతో ఎన్నికల ఫలితం పైన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+