వైసీపీకి అలా రాజీనామా.. ఆ పార్టీలో ఇలా టికెట్
AP Congress 2nd list: రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇదివరకు విడుదల చేసిన తొలి జాబితాలో 114 అసెంబ్లీ, అయిదు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
లోక్‌సభ స్థానాల్లో విశాఖపట్నం- పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి- వేగి వెంకటేష్, ఏలూరు- లావణ్య కావూరి, నరసరావుపేట- గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, నెల్లూరు- కొప్పుల రాజు, తిరుపతి (ఎస్సీ రిజర్వుడ్)- డాక్టర్ చింతా మోహన్ బరిలో నిలిచారు.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో టెక్కలి- కిల్లి కృపారాణి, భీమిలి- అడ్డాల వెంకటవర్మ రాజు, విశాఖపట్నం దక్షిణం- వాసుపల్లి సంతోష్, గాజువాక- లక్కరాజు రామారావు, అరకు (ఎస్టీ రిజర్వ్డ్)- శెట్టి గంగాధర స్వామి, నర్సీపట్నం- రుతుల శ్రీరామమూర్తి, గోపాలపురం (ఎస్సీ రిజర్వ్డ్)- మార్టిన్ లూథర్‌కు టికెట్లు దక్కాయి.
యర్రగొండపాలెం (ఎస్సీ రిజర్వ్డ్)- డాక్టర్ బూధల అజిత రావు, పర్చూరు- నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి, సంతనూతలపాడు (ఎస్సీ రిజర్వ్డ్)- విజేష్ రాజ్ పాలపర్తి, గంగాధర నెల్లూరు (ఎస్సీ రిజర్వ్డ్)- రమేష్ బాబు దేయల, పూతలపట్టు (ఎస్సీ రిజర్వ్డ్)- ఎంఎస్ బాబు పోటీలో నిలిచారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి టికెట్ దక్కించుకున్న కిల్లి కృపారాణి గానీ, చిత్తూరు జి్లా పూతలపట్టులో బరిలో నిలిచిన ఎంఎస్ బాబు గానీ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే. టికెట్ దక్కకపోవడం వల్ల వారిద్దరూ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
ఎంఎస్ బాబు పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. వైఎస్ఆర్సీపీకే చెందిన చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాకు కూడా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ఎలీజాకు తొలి జాబితాలోనే టికెట్ లభించింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం వైసీపీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అది సాధ్యపడలేదు.












Click it and Unblock the Notifications