కెవిపిపై మూకుమ్మడి దాడి, టి కాంగ్రెసు నేతలు కూడా

Congress, TDP demand for KVPs arrest
హైదరాబాద్: టైటానియం కుంభకోణంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుపై విచారణ జరిపించాలని, ఆయనను అరెస్టు చేయాలనే డిమాండ్లు ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు సొంత పార్టీ కాంగ్రెసు నుండి కూడా వినిపిస్తున్నాయి. టైటానియం స్కాంతో దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన కెవిపిని వెంటనే అరెస్ట్ చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

జగన్‌కు సోమిరెట్టి సవాల్ విసురుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ, విదేశాల్లో తెలుగువాడిని అప్రతిష్టపాలు చేసిన కెవిపి రాజ్యసభ సభ్యత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అమెరికా కంటే ముందే రాష్ట్ర గవర్నర్ టైటానియం కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ సత్తా ఏమిటో, వ్యక్తిత్వం ఏమిటో ఈ కేసులో తేలిపోవాలన్నారు.

ఈ కుంభకోణంలో జగన్‌తోపాటు కెవిపి, సుధీకర్ రెడ్డిలకు 25 సంవత్సరాలపాటు బెయిల్ రాదని ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక జగన్ దిగమింగిన రూలక్షా 27 వేల కోట్లు కక్కించి డ్వాక్రా, రైతులు, మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.

ప్రజలేం కావాలి?: విహెచ్

వైయస్, ఆయన ఆత్మబంధువు భాగస్వాములైన టైటానియం కుంభకోణం విచారణలో అమెరికాకు భారత ప్రభుత్వం సహకరించాలని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు కోరారు. రాజమండ్రిలో విహెచ్ మీడియాతో మాట్లాడారా. ముఖ్యమంత్రుల బంధువులు, కుమారులు దోచేస్తుంటే ప్రజలు ఏమి కావాలని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+