బాబు, వెంకయ్యే కారణం: విహెచ్, హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడిపై కాంగ్రెసు తెలంగాణ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు.

ఈ పరిస్థితికి చంద్రబాబునాయుడు, వెంకయ్యనా యుడే కారణమని ఆయన ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు అధికారాలు ఇచ్చే బదులు తెలంగాణలో రాష్టప్రతి పాలన పెట్టి చంద్రబాబునాయుడినే పాలించమని చెప్పండి అని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు.

Congress Telangana leaders lash out at Venkaiah and chandrababu

గవర్నర్‌కు అధికారాలు ఇస్తే గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఏం జరిగినా అందుకు ఆంధ్రా ప్రాంత నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపే సమగ్ర సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

గవర్నర్‌కు అధికారాలపై పిటిషన్

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టంలో సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఉమ్మడి రాజధానిపై అధికారాలను ఇస్తూ ఉన్న అంశాలను సవాలు చేస్తూ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంటు పరిధిలో లేని ఈ అంశం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏడవ షెడ్యూల్‌లో రాష్ట్ర జాబితా ప్రకారం రాష్ట్ర శాసనసభ అధికారాలపై చట్టాలను తయారు చేసే హక్కు పార్లమెంటుకు లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+