ఏపీలో ఎన్నికల వేళ.. ఏడు గ్యారెంటీలతో ప్రజల్లోకి కాంగ్రెస్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఈ ఎన్నికలలో సత్తా చాటాలని ప్రయత్నాలు సాగిస్తుంది. ముఖ్యంగా ఏపీలో లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది.

ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిలకు ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.

Congress will go to the people with seven guarantees in ap elections!!

ఇక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నదానిపై ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపిలో ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి వెళుతున్నట్లు ఆయన విశాఖలో మీడియా సమావేశంలో ప్రకటించారు.

వై నాట్ కాంగ్రెస్ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని ఆయన పేర్కొన్నారు. రేపు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ తో పిసిసి సమావేశం ఏర్పాటు చేశామని, తర్వాత రోజు యూత్ కాంగ్రెస్ నాయకులతో ఒంగోలులో యువ భేరి సభ, పాదయాత్ర ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు .

తన సహచర పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ జనవరి 14వ తేదీ నుండి చేపట్టబోయే భారత్ జోడో న్యాయ యాత్ర పోస్టర్ ను విడుదల చేశారు. మణిపూర్ లోని ఇంపాల్ లో యాత్ర ప్రారంభమై 66 రోజులపాటు సాగుతుందని తెలిపారు. 15 రాష్ట్రాలు, 110 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీలు, 6700 కిలోమీటర్లు యాత్ర వుంటుందన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యాత్ర తలపెట్టినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+