వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్లు తగ్గినా: జైపాల్, మార్చుకో: కిరణ్‌కు విహెచ్ వార్న్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy and Vh
హైదరాబాద్: కొందరు వెనక్కి తగ్గినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి శనివారం అన్నారు. తెలంగాణఫై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. హైదరాబాదులోని చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర స్మారక దినోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాదు అభివృద్ధిలో గుజరాతీ, మరాఠీ, బెంగాళీల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. కొందరికి ఎన్నికలు వస్తేనే మందిరాలు గుర్తుకు వస్తాయని మండిపడ్డారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. మానవ జాతి పుట్టక ముందే కృష్ణా, గోదావరి నదులు పుట్టాయని, వాటిని ఎవరు ఎత్తుకు పోలేరన్నారు.

అప్పడే వస్తే: డిఎస్

1972లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ సమస్య ఉండి ఉండేది కాదని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలతో తమకు విభేదాలు లేవని, కేవలం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న సీమాంధ్ర పాలకులతోనే విభేదాలన్నారు.

సీమాంధ్రకు ఏం కావాలో అడిగితే తాము సహకరిస్తామన్నారు. మత విద్వేషాలు అడ్డుపెట్టుకుని బిజెపి అధికారంలోకి రావాలని చూస్తోందని డిఎస్ వ్యాఖ్యానించారు. తెలంగాణపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు.

పంథా మార్చుకో: కిరణ్‌కు విహెచ్ హెచ్చరిక

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పంథాను మార్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు హెచ్చరించారు. అధిష్టానం చలువతో పదవి పొంది ఇప్పుడు ఆయన తిరగబడటం సరికాదన్నారు. సొంత జిల్లాలో సోనియా గాంధీకి సమాధి కడితే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న జగన్ మాట తప్పారని, ఆయనతో పాటు చంద్రబాబు, కిరణ్‌లు కూడా యూ టర్న్ తీసుకున్నారన్నారు.

అడ్డుకోవద్దు: పొన్నం

రాజ్యాంగబద్దంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ ఏర్పాటు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు.

English summary
Central Minister Jaipal Reddy on Saturday said Congress will not go back on its Telangana deicision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X