వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చినా పకోడీలు వేసి వస్తానన్న బాధితుడు ... వైద్య సిబ్బంది షాక్ !!

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్న చాలామంది ఇంకా కరోనా తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు . మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగితే జరిమానాలు వేస్తామని చెబుతున్నా, మాస్కులు లేకుండా తారసపడుతున్న వ్యక్తులు ఉన్నారు.

Recommended Video

#CoronavirusinAP:#Guntur లో 152 మందికి కరోనా పాజిటివ్.. గుంటూరు ప్రజల్ని వణికిస్తోన్న కరోనా

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ జనాలు మాత్రం భయం లేకుండా తిరుగుతున్నారు .

 ఏపీలో కరోనా కల్లోలం .. నిన్న మూడు వేలకు పైగా కొత్తకేసులు , 12 మరణాలు, ఆ జిల్లాల్లోనే అధికం ఏపీలో కరోనా కల్లోలం .. నిన్న మూడు వేలకు పైగా కొత్తకేసులు , 12 మరణాలు, ఆ జిల్లాల్లోనే అధికం

కరోనా పాజిటివ్ వచ్చినా బయట జనాల్లో తిరుగుతున్న బాధితులు

కరోనా పాజిటివ్ వచ్చినా బయట జనాల్లో తిరుగుతున్న బాధితులు


కరోనా మహమ్మారిని ఇబ్బడిముబ్బడిగా వ్యాప్తి చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితి ఎలా ఉందంటే , కరోనా పాజిటివ్ వచ్చింది అని చెప్పినా కూడా సరేలే అండి .. జాగ్రత్తలు తీసుకుంటాం అని జనాల్లోనే తిరుగుతున్నారు. ఈ పరిస్థితులు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒక్క రోజులో లక్ష యాభై వేలకి పైగా పెరిగిన రోజువారీ కొత్త కేసులు దేశాన్ని వణికిస్తుంటే , ప్రజల్లో ఏమాత్రం అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

 పకోడి షాప్ యజమానికి కరోనా , పకోడీలు వేసి అమ్మి వస్తానన్న యజమాని

పకోడి షాప్ యజమానికి కరోనా , పకోడీలు వేసి అమ్మి వస్తానన్న యజమాని

తాజాగా ఓ సంఘటన ఏపీ లోని వైద్య సిబ్బందిని షాక్ కు గురి చేసింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడీ షాపు యజమాని కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్ రావడంతో వైద్య సిబ్బంది ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోని సదరు పకోడీ షాప్ నిర్వాహకుడు, పకోడీ పిండి ఉందమ్మా, అది కాస్తా పకోడీలు వేశాక షాప్ క్లోజ్ చేసి వస్తానని సమాధానం చెప్పాడు.

వైద్య సిబ్బంది షాక్ .. ఆపై బాధితుడిని ఐసోలేషన్ కు తరలింపు

వైద్య సిబ్బంది షాక్ .. ఆపై బాధితుడిని ఐసోలేషన్ కు తరలింపు

అతని సమాధానం విన్న వైద్య సిబ్బంది షాక్ కు గురైనా, మళ్లీ తేరుకొని అతనికి చివాట్లు పెట్టారు. కరోనా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది అని తెలిసిన తర్వాత కూడా, మీకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత కూడా పకోడీలు వేసి అమ్ముకోవాలని ఎలా చెప్తున్నారు అంటూ మండిపడ్డారు. వెంటనే అతన్ని 108లోకి ఎక్కించి ఐసోలేషన్ కు తరలించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. గతంలో ఈ జిల్లా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో విపరీతంగా కేసులను నమోదు చేసింది.

 కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్నా ప్రజలలో పెరుగుతున్న నిర్లక్ష్యం

కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్నా ప్రజలలో పెరుగుతున్న నిర్లక్ష్యం

ఇలాంటి వాళ్ళు కరోనా ను మరింత వ్యాప్తి చేస్తున్నారని, పాజిటివ్ అని తేలిన వెంటనే ఐసోలేషన్ కు వెళ్లి మిగతా వారు కరోనా బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైద్యులు అంటున్నారు. కరోనా విషయంలో అప్రమత్తత, అవగాహన అవసరమని, ప్రజలందరూ కచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని చెప్తున్నారు. మాస్కులు ధరించడం , సామాజిక దూరం పాటించడం, చేతులు శానిటైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు. సెకండ్ వేవ్ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత అటు ప్రజలపై కూడా ఉందని తేల్చి చెబుతున్నారు.

English summary
Corona positive tested to a pakoda shop owner at old national highway in Palasa Kashibugga Municipality. When he got positive, the medical staff called and told him about it. However, the pakoda seller said ,after completion of his business , he will come to isolation . The medical staff shocked and reprimanded him and isolated him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X