మండలి కార్యదర్శిపై చైర్మన్ సీరియస్ ..సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు హుకుం..ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ !!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లులను అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకోటానికి సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చెయ్యాలని భావించి మండలి చైర్మన్ షరీఫ్ ఆ ఫైల్ ను శాసన మండలి కార్యాలయానికి పంపటం మండలి కార్యదర్శి దానిని తిరిగి పంపించటం తెలిసిందే . ఇక శాసనమండలి కార్యదర్శి ఫైల్ తిరిగి పంపించటంపై మండలి చైర్మన్ షరీఫ్ సీరియస్ అయ్యారు.

మండలి కార్యాలయ కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఫైల్ తిప్పి పంపటంపై మండిపడిన చైర్మన్

మండలి కార్యాలయ కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఫైల్ తిప్పి పంపటంపై మండిపడిన చైర్మన్

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లను మండలి కార్యాలయానికి పంపి కమిటీ ఏర్పాటు చెయ్యాలని ఛైర్మన్ షరీఫ్ పంపించిన ఫైల్ ను తిరస్కరించి రూల్‌ 154 కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఫైల్‌ మీద రాసి మండలి కార్యాలయ కార్యదర్శి తిప్పి పంపటంపై చైర్మన్ షరీఫ్ మండిపడ్డారు .సెలక్ట్ కమిటీ ఏర్పాటు ఫైల్ వెనక్కి పంపండంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని ఆదేశాలు జారీ చేశారు.

తన విచక్షణాధికారాల మేరకే సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నానన్న చైర్మన్

తన విచక్షణాధికారాల మేరకే సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నానన్న చైర్మన్

తనకు ఉన్న విచక్షణాధికారాల మేరకే నిర్ణయం తీసుకున్నానని ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు . జాప్యం చేస్తే తప్పక చర్యలు తీసుకుంటానని మండలి కార్యదర్శిని చైర్మన్‌ షరీఫ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు రూల్ 154 క్రింద చెల్లవని మండలి కార్యదర్శి ఫైల్‌ను వెనక్కి పంపండం పట్ల మండిపడిన షరీఫ్ రూల్ నెంబర్ 154 కింద తనకు సంక్రమించిన విచక్షణాధికారాల మేరకు సెలక్ట్ కమిటీని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఫైల్ ను మళ్ళీ మండలికి పంపిన చైర్మన్ ... సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు

ఫైల్ ను మళ్ళీ మండలికి పంపిన చైర్మన్ ... సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు

ఇక శాసనమండలిలో ఓటింగ్ జరగదు కాబట్టి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చెల్లదని వైసీపీ వాదిస్తున్న నేపధ్యంలో ఆయన దీనికి సంబంధించి ఓటింగ్ సాధ్యంకాదని స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీని నియమించి, దానికి సంబంధించి ఫైల్‌ను వెంటనే పంపని పక్షంలో అందులో ఉండే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చైర్మన్ షరీఫ్ కార్యదర్శిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత రాత్రి ఈఫైలింగ్ సిస్టం ద్వారా సెక్రటరీకి షరీఫ్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ఫైల్ ను పంపినట్లు సమాచారం.

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు జరుగుతుందా లేదా ... సర్వత్రా ఉత్కంఠ

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు జరుగుతుందా లేదా ... సర్వత్రా ఉత్కంఠ

దీంతో కార్యదర్శి ఫైల్ ను ఆమోదించి సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా .. లేదా మళ్ళీ తిరస్కరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది . ఒక వేళ తిరస్కరిస్తే ధిక్కరణ నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని చైర్మన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపధ్యంలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+