పవన్ దూకుడు వెనుక, ఆ కాంప్రమైజ్ - బొత్సా సంచలనం..!!
వైసీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాకినాడలో బియ్యం స్మగ్లింగ్ అంటూ పవన్ గబ్బర్ సింగ్ - 3 సీన్ క్రియేట్ చేసారని ఆరోపించారు. అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన పవన్.. తన పార్టీకి చెందిన మంత్రిని ఏం చేసారని నిలదీసారు. మంత్రి గా కొత్త ఉత్సాహంతో పవన్ కనిపిస్తున్నారంటూ తాను అలా చేసే వోక్స్ వ్యాగన్ లో సంతకం చేసానని గుర్తు చేసారు. రెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలంటూ వ్యాఖ్యానించారు.
అప్పుల భారం 70 వేల కోట్ల
శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్సా డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా స్పందించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేసారు. యూనిట్‌కు 1రూపాయి20పైసలు పెంచారని ధ్వజమెత్తారు. ప్రజల పైన కూటమి ప్రభుత్వం మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపిందని చెప్పుకొచ్చారు. అప్పుల భారం పెంచారని వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన వారు ఇప్పుడు అప్పులెందుకు చేస్తున్నారని నిలదీసారు. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలని బొత్సా డిమాండ్ చేసారు.

గబ్బర్ సింగ్ -3
పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని బొత్సా వ్యాఖ్యానించారు. ఈ రోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చామని బొత్సా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం తగ్గిందని.. కొనుగోలు శక్తి పడిపోయిందని విశ్లేషించారు. వాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారని ఆరోపించారు. దానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏంటని ఎద్దేవా చేసారు. నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయని విమర్శించారు. పవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3 తలిపించిందని బొత్సా వ్యాఖ్యానించారు.
కాకినాడలో పవన్
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పేనని, బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోర్టు లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారని బొత్సా చెప్పుకొచ్చారు. ఇది నిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. మంత్రిగా అయిన కొత్తల్లో అంతా తామే అని భావిస్తారని..2004లో తాను తొలి సారి మంత్రి అయిన సమయంలో అదే ఉత్సాహంతో వోక్స్ వ్యాగన్ పైన సంతకం చేసానని వివరించారు. కాకినాడ పోర్టులో వైసీపీ నేతలు చిక్కుతారని పవన్ వెళ్లారని.. అయితే, అక్కడ అసలు సూత్రధారులు తెలిసి వెనక్కు వచ్చేసారని బొత్సా చెప్పుకొచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications