టెక్కీ ఆత్మహత్య: ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

Couple, techie commit suicide in separate incidents
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ టెక్కీతో పాటు ముగ్గురు వ్యక్తులు రెండు విడివిడి సంఘటనల్లో మంగళవారం ఆత్మహత్యా సంఘటలు వెలుగు చూశాయి. సూరారం డివిజన్‌లోని సాయిబాబానగర్‌లో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కేదార్‌లంక గ్రామానికి చెందిన ఘంటా వీరబాబు (25), వెంకటలక్ష్మి (23) భార్యాభర్తలు. వీరికి పూర్ణచందర్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. వీరు సాయిబాబానగర్‌లోని అంజిరెడ్డిబస్తీలో నివాసముంటున్నారు.

వెంకటలక్ష్మికి తల్లిదండ్రులు లేకపోవడంతో పెద్దమ్మ నాగమణి వద్ద పెరిగింది. నాలుగు సంవత్సరాల క్రితం వీరబాబుతో ఆమెకు వివాహం జరిగింది. ప్రస్తుతం నాగమణి కుటుంబసభ్యులు కూడా సాయిబాబానగర్ సమీపంలోనే నివాసముంటున్నారు.వీరబాబు జీడిమెట్లలోని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య చిన్న,చిన్న ఘర్షణలు జరుగుతుండేవని బంధువుల ద్వారా తెలిసింది. ఇద్దరి మధ్య మంగళవారం ఏమి జరిగిందో తెలియదు గానీ వెంకటలక్ష్మి గదిలో రాడ్‌కు చీరతో ఉరివేసుకోగా, వీరబాబు ఎదురింట్లోని వేపచెట్టుకు తాడుతో ఉరివేసుకొన్నాడు.

మంగళవారం సాయంత్రం స్థానికులు గమనించి దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రుల మృతితో ఏడాదిన్నర కుమారుడు అనాథ అయ్యాడు.

టెక్కీ ఆత్మహత్య

ఇదిలావుంటే, ఒరాకిల్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల టెక్కీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని కోల్‌కతాకు చెందిన సుధేష్ణ దాస్‌గా గుర్తించారు. మాదాపూర్‌లోని తన అద్దె ఇంట్లో అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాస్ తన తల్లి అనితా దాస్‌తో కలిసి 2004 నుంచి అయ్యప్ప సొసైటీలోని శ్రీ లక్ష్మీ నివాస్ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నాడు.

సోమవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో అనితా దాస్ ఇంటర్నెట్ బిల్లు చెల్లించి తిరిగి వచ్చి చూసే సరికి ప్రధాన ద్వారం లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎంతకీ సుదేష్ణ దాస్ పలకకపోవడంతో ఇరుగుపొరుగువారి సహాయంతో, వాచ్‌మన్ సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. సుధేష్ణ దాస్ తన గదిలో ఉరేసుకుని కనిపించాడు. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. వ్యక్తిగత కారణాల వల్లనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+