పోలీసులకు షాక్: రిషికేశ్వరి కేసులో ఛార్జీషీట్ తిరస్కరించిన కోర్టు
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో పోలీసులకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీటును న్యాయస్థానం గురువారం నాడు తిరస్కరించింది. ఛార్జీషీటు సక్రమంగా లేదని జడ్జి పేర్కొన్నారు.
ర్యాగింగ్ సంబంధించిన చట్టాలే కాకుండా మరో కీలకమైన ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్(పోక్సో) చట్టాన్ని కూడా తొలిసారిగా ఛార్జిషీటులో పొందుపరిచారు. ఐతే రిషికేశ్వరి మైనర్ కాదని అందువల్ల ఆ చట్టం వర్తించదని జడ్జి అభిప్రాయపడ్డారు.

ఈ చట్టం పరిధిలోకి రానప్పుడు ఇక్కడి కోర్టులో న్యాయస్థానంలో విచారణ సాధ్యపడదని, వేరే కోర్టుకు వెళ్లాలంటూ చార్జిషీటును తిరస్కరించింది. కాగా, స్థానిక కోర్టు తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రిషికేశ్వరి తరపు లాయర్ చెప్పారు.
కాగా, రిషికేశ్వరి కేసులో మరికొంతమందిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు గత శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ చార్జిషీట్‌లో ప్రిన్సిపాల్ బాబూరావును నాలుగో నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హనీషా, జయ తరణ్, సాయి శ్రీనివాస్ అనే నిందితులను అరెస్టు చేయగా, 47 రోజుల తరువాత వారు బెయిల్‌పై వారు విడుదలయ్యారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications