ఏపీలో కరోనా: ఆరని కోయంబేడు చిచ్చు.. కొత్తగా 25 కేసులు.. కృష్ణాలో జీరో.. లాక్‌డౌన్ 4.0 ప్రాంతాలివే..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 25 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2230కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఐదుగురికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ తో లింకులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కొత్త కేసులు తగ్గుతున్నాయనుకునేలోపే కోయంబేడు చిచ్చురాజుకోవడం, శనివారం వెలుగుచూసిన కేసుల్లోనూ మెజార్టీ వ్యక్తులు ఆ మార్కెట్ నుంచి వచ్చినవాళ్లే కావడం కలకలం రేపుతున్నది.
Recommended Video

కృష్ణా జిల్లా రికార్డు..
ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేసుల సంఖ్య 2230కి పెరగ్గా, అందులో 1433 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 747 మాత్రమేనని ప్రభుత్వం పేర్కొంది. కృష్ణా జిల్లాలో మరొకరు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 50కి పెరిగింది. శనివారం ఒక్కరోజే ఏకంగా 80 మంది కొవిడ్ పేషెంట్లను డిశ్చార్జ్ చేసి రికార్డులకెక్కిన కృష్ణా జిల్లా.. 24 గంటల్లో మరో శుభవార్తను చవిచూసింది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్త కేసులేవీ నమోదుకాలేదు. జిల్లాలో మొత్తం 367 కేసులు నమోదైతే, అందులో 253 మంది కోలుకోగా, 15 మంది చనిపోయారు. 99 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

కర్నూలుకు తప్పని కష్టాలు..
ఏపీలో కరోనా ధాటికి బాగా దెబ్బతిన్న జిల్లా కర్నూలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3 కేసులు రావడంతో మొత్తం సఖ్య 611కు పెరిగింది. అందులో 405 మంది డిశ్చార్జ్ అయిపోగా, 187 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల్లోనూ జిల్లా మొదటి స్థానంలో ఉంది. కేసుల తీవ్రత దృష్ట్యా కేంద్రం తాజాగా ప్రకటించిన 30 డేంజర్ జోన్లలో కర్నూలు కార్పొరేషన్ పేరు కూడా ఉంది. సోమవారం నుంచి మిగతా ప్రాంతాలకు సడలింపులు లభించనుండగా, కర్నూలులో మాత్రం ఆంక్షలు మరికొంత కాలం కొనసాగనున్నాయి.

ప్రమాదంలోకి శ్రీకాకుళం.. ప్రకాశంలో మళ్లీ..
ఆదివారం వెలుగుచూసిన 25 కొత్త కేసుల్లో అత్యధికంగా 7 కేసులు శ్రీకాకుళం జిల్లాలోనే నమోదుకావడం గమనార్హం. చాలా కాలంపాటు కరోనా ఫ్రీగా జిల్లాగా కొనసాగిన శ్రీకాకుళంలో వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో కలకలం రేపుతున్నది. ఇక, రెండ్రోజుల కిందటే కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటించిన ప్రకాశంలో మళ్లీ కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. చెరో 4 కొత్త కేసులతో గుంటూరు(417), చిత్తూరు(177) తర్వాతి వరుసలో ఉన్నాయి. విశాఖలో కొత్తగా 3 కేసులతో మొత్తం 75కు పెరిగింది. ఏపీలో నమోదైన మొత్తం కేసుల్లో(2230) ఇతర రాష్ట్రాలకు చెందినవారు 150 మంది ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

జగన్ స్టైల్ లాక్‌డౌన్ 4.0
సోమవారం నుంచి అమలులోకి రానున్న లాక్ డౌన్ 4.0పై కేంద్రం కొత్త వైఖరి అవలంభించనుంది. గతంలో జిల్లాల వారీగా జోన్లను ప్రకటించిన మోదీ సర్కారు.. ఈసారి మెజార్టీ కేసులు నమోదవుతోన్న 30 మున్సిపల్ కార్పొరేషన్లపై మాత్రమే ఆంక్షలు విధించింది. ఆయా రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ రూల్స్ ఎలా ఉండాలనే నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టింది. దీంతో ఏపీలో సీఎం జగన్ స్టైల్ లాక్ డౌన్ కొనసాగనుంది. మెజార్టీ ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టును కూడా ప్రారంభించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ముందస్తు హింట్ లో భాగంగా ఏపీ ఆరోగ్య శాఖ జిల్లాల వారీగా రెడ్ జోన్ల వివరాలను తెలిపింది..

జిల్లాల వారీగా ఇలా..
ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించిన మేరకు జిల్లాల వారీగా రెడ్ జోన్లు ఇవి.. ఆదివారం వెలువడనున్న కేంద్ర హోం శాఖ ఆదేశాలను బట్టి ఏపీ సర్కారు ఆయా జోన్లలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది.
కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్నం, నూజీవిడు, ముసునూరు.
కర్నూలు జిల్లా... ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, కర్నూలు టౌన్, నందికోట్కూరు, పాణ్యం, బనగానిపల్లె, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.
కడప జిల్లా.. మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం.
నెల్లూరు జిల్లా... నెల్లూరు టౌన్, నాయుడుపేట, వాకాడు, సూళ్ళురుపేట, తడ ప్రాంతాలు.
ప్రకాశం జిల్లా... కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు ప్రాంతాలు.
అనంతపురం జిల్లా.. హిందూపూర్, కల్యాణదుర్గం, అనతపురం టౌన్
చిత్తూరు జిల్లా.. శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్, రేణిగుంట, పరదయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగిరి, పుత్తూర్, వెంకటగారికోట.
తూర్పుగోదావరి జిల్లా... సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం.
గుంటూరు జిల్లా... మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్, తాడేపల్లి, మంగళగిరి.
విశాఖపట్నం జిల్లా... పెదగంట్యాడ, నర్సీపట్నం, కశింకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్, పద్మనాభం.
విజయనగరం జిల్లా... బొందపల్లె, పూసపాటిరేగ, కొమరాడ, బలిజిపేట ప్రాంతాలు.
పశ్చిమ గోదావరి జిల్లా... పోలవరం, గోపాలపురం, టి, నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉంది, భీమవరం, నరసాపురం
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications