ఏపీలో కనిష్ట స్ధాయికి కరోనా - 630కి తగ్గిన కొత్త కేసులు- కర్నూల్లో సింగిల్ డిజిట్‌

ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. గతంతో పోలిస్తే తగ్గిన వైరస్ తీవ్రత, పెరిగిన పరీక్షల కారణంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్యలోనూ భారీగా క్షీణత కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 630 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులోనూ కర్నూలు సింగిల్ డిజిట్‌కు చేరుకోవడం భారీ ఊరటగా కనిపిస్తోంది. దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లోనే కరోనా ప్రభావం ఇంకా తగ్గాల్సి ఉంది.

ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా కృష్ణాజిల్లాలో 97, పశ్చిమగోదావరి జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి.

covid 19 affect at lowest level in ap, 630 new cases in last 24 hours

ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. గతంతో పోలిస్తే తగ్గిన వైరస్ తీవ్రత, పెరిగిన పరీక్షల కారణంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్యలోనూ భారీగా క్షీణత కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 630 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులోనూ కర్నూలు సింగిల్ డిజిట్‌కు చేరుకోవడం భారీ ఊరటగా కనిపిస్తోంది. దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లోనే కరోనా ప్రభావం ఇంకా తగ్గాల్సి ఉంది.

ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా కృష్ణాజిల్లాలో 97, పశ్చిమగోదావరి జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంలో చిత్తూరు 89, గుంటూరు 85, తూర్పుగోదావరి 64, విశాఖ 40 కేసులు నమోదయ్యాయి. అత్యల్ప కేసుల జాబితాలో కేవలం 5 కేసులతో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో శ్రీకాకుళం 12, విజయనగరం 24, కడప 28, అనంతపురం 29, నెల్లూరు 32, ప్రకాశం 35 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8.71 లక్షలకు చేరుకుంది. వీరిలో 8.58 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 6166 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మరణాల విషయానికొస్తే కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చనిపోయారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7024కు చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 57 వేల 132 శాంపిల్స్‌ పరీక్షించారు. ఇందులో 630 మందికి కరోనా నిర్ధారణ కాగా.. 882 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో పరీక్షించిన శాంపిల్స్‌ సంఖ్య కోటీ 3 లక్షల 50 వేలకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+