ఏపీలో కరోనా: భారీగా తగ్గాయి -కొత్తగా 121 కేసులు, 2మరణాలు -ఆ జిల్లాకు రిలీఫ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ అత్యల్ప స్థాయికి పడిపోయాయి. సెలవు రోజు కావడంతో ఆదివారం టెస్టుల సంఖ్యను తగ్గించగా, అందుకు తగినట్లే కొత్త కేసులు కూడా తగ్గాయి. అయితే, రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. మరణాలు కూడా అదుపులోకి వచ్చాయి. విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా రాకపోవడం గమనార్హం..

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెలువరించిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,933 మందికి కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులు చేయగా, కొత్తగా 121 మంది పాజిటివ్ గా తేలారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,037కి చేరింది. ఇక..

covid-19 in ap: 121 new cases, 213 recoveries and 2 death in the last 24 hrs

కరోనా మహమ్మారి కాటుకు తాజాగా మరో ఇద్దరు బలైపోయారు. కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు కరోనా మహమ్మారి వల్ల మరణించినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,131కి పెరిగింది. అదే సమయంలో..

ఏపీలో డిశ్చార్జీలు యధావిధిగా కొత్త కేసుల కంటే ఎక్కువగా వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 213 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఏపీలో రికవరీల సంఖ్య 8,75,456కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,450కు పడిపోయాయి. మొత్తంగా సోమవారం నాటికి ఏపీలో 1,23,55,607 శాంపిల్స్‌ను టెస్టు చేసినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

తాజా కరోనా బులిటెన్ ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చాయి. అక్కడ నిన్న ఒక్కరోజే 24 కేసులు రాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అతి తక్కువ యాక్టివ్ కేసులు(26) ఉన్న జిల్లా కూడా విజయనగరమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+