వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: సర్కారు వార్నింగ్ -కొత్తగా 338 కేసులు, 4 మరణాలు -ఆ జిల్లాలో మళ్లీ పెరిగాయ్

|
Google Oneindia TeluguNews

కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నవేళ.. వేడుకల పేరుతో బయట తిరిగితే ప్రమాదమని ప్రతిపాదిత కొత్త రాజధాని వైజాగ్ పోలీసులు హెచ్చరించారు. వైజాగ్ ప్రజలతో పాటు రాష్ట్రంలో అందరూ కూడా దయ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండాలని, కరోనా నుంచి సురక్షితంగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇక కరోనా కేసుల సంగతి చూస్తే..

ఒంగోలు: ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎదురింటాయనకు భారీ షాక్ -పోలీసుల ఎంట్రీతో అనూహ్య ట్విస్ట్ఒంగోలు: ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎదురింటాయనకు భారీ షాక్ -పోలీసుల ఎంట్రీతో అనూహ్య ట్విస్ట్

ఏపీ వైద్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 338 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 79 వేల 391కి చేరాయి. మరణాల సంఖ్య 7,108కి పెరిగాయి. నిన్న ఒక్కరోజే 61 వేల 148 శాంపిల్స్ ను పరీక్షించగా, మొత్తం టెస్టుల సంఖ్య 1,18,25,566కు చేరినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ఇక..

covid-19 in ap: 338 fresh cases, 4 deaths in last 24 hrs, ap aggregate reaches 8.82 lakh

జిల్లాల వారీగా చూస్తే, గత 24 గంటల్లో గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. కొత్తగా అనంతపురం జిల్లాలో 16 కేసులు, చిత్తూరు 65, ఈస్ట్ గోదావరి 42, గుంటూరు 38, కడప 20, కృష్ణా 44, కర్నూలు 6, నెల్లూరు 18, ప్రకాశం 15, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 34, విజయనగరం 8, వెస్ట్ గోదావరి జిల్లాలో 19 కొత్త కేసులు వచ్చాయి. వరుసగా రెండు రోజులు 'జోరో కేసులు'గా ఉన్న విజయనగరం జిల్లాలో నిన్న రెండు కేసులు, ఇవాళ ఎనిమిది కొత్త కేసులు రావడం గమనార్హం.

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

గడిచిన 24 గంటల్లో 328 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, దీంతో రాష్ట్రంలో రివకరీల సంఖ్య 8 లక్షల 69 వేల 021కి చేరిందని, ప్రస్తుతం ఏపీలో 3 వేల 262 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులిటెన్ లో పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటికే ఒక దఫా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ చేపట్టగా, జనవరి 2న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త డ్రైరన్ కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
Andhra Pradesh COVID-19 tally rose to 8.82 lakh as 338 cases were added afresh in 24 hours ending 9 am on Thursday. The latest bulletin said 328 patients had recovered and four more succumbed in a day. The number of active cases in the state now reduced to 3,262 after a total of 8,71,916 recoveries and 7,108 deaths. Chittoor district reported 65, Krishna 44, East Godavari 42, Guntur 38 and Visakhapatnam 34 fresh cases in a day. The remaining eight districts added less than 25 cases each. Guntur, Kadapa, Visakhapatnam and West Godavari districts add one more death each to their tally, the bulletin said. So far, 1.18 crore sample tests were completed in the state that turned out an overall infection positivity rate of 7.46 per cent. PTI DBV ROH ROH
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X