ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 51 కేసులు, 2మరణాలు -ట్యాలీ 8.89లక్షలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అయితే, మరణాలు మాత్రం అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. చాలా జిల్లాల్లో కొత్త కేసులు రెండులోపే నమోదయ్యాయి. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు ఇంకా దిగువకు చేరాయి...

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51 పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,89,010కి పెరిగింది. ఇప్పటి వరకు 7,165 మంది ప్రాణాలు కోల్పోయారు.

 covid-19 in ap: 51 new cases 2 deaths in last 24 hrs, state tally reaches 8.89 lakh

నిన్న ఒక్కరోజే 57 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా రాష్ట్రంలో రికవరీల సంఖ్య 8,81,238కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 607 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 26 వేల 474 శాంపిల్స్ పరీక్షించామని, ఇప్పటివకు రాష్ట్రంలో మొత్తం 1.36కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

జిల్లాల వారీగా చిత్తూరులో అత్యధికంగా 14 కొత్త కేసులు వచ్చాయి. అనంతపురం 4, ఈస్ట్ గోదావరి 3, గుంటూరు 4, కడప1, కృష్ణా 6, కర్నూలు 2, నెల్లూరు 3, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 8, విజయనగరం 2, వెస్ట్ గోదావరి జిల్లాలో 3 కొత్త కేసులు వచ్చాయి. కాగా,

రాష్ట్రంలో ఈరోజు కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్‌కు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. హెల్త్ కేర్ వర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బంది మొదటి డోస్ ఎక్కడ వేసుకున్నారో రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలని అధికారులు వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ సూచించారు. మొదటి డోస్ ఏ కంపెనీది వేసుకున్నారో రెండో డోస్ కూడా అదే కంపెనీది వేసుకోవాలని తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+