అల్లు అర్జున్‌కు వత్తాసు నీచం - సినీ ఇండస్ట్రీకి బాధ్యత లేదా..!!
అల్లు అర్జున్ అరెస్ట్..తరువాతి పరిణామాలు ఆసక్తిగా మారాయి. సంధ్యా థియేటర్ వద్ద పుష్ఫ -2 ప్రీమియం షో వేళ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించారు. ఆమె కుమారుడు ప్రాణా పాయ పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయి విడుదల అయిన అల్లు అర్జున్ కు పలు రాజకీయ పార్టీలు.. సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. దీని పై ఇప్పటికే సీఎం రేవంత్ స్పందించారు. ఇప్పుడు సీపీఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు.
మద్దతు ఎందుకు
అల్లు అర్జున్ అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అరెస్ట్ తరువాత జైలులో 13 గంటలు ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు బెయిల్ తో బయటకు వచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ వేళ వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుగా నిలిచాయి. అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పు బట్టాయి. కానీ, సీఎం రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో రేవతి మరణం .. ఆమె కుమారుడు ఆస్పత్రిలో క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా, జైలు నుంచి విడుదల అయిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు పలువురు పరామర్శించారు.

బాధిత కుటుంబం పట్టదా
తాజాగా అల్లు అర్జున్ చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లారు. అయితే, అల్లు అర్జున్ ఎపిసోడ్ పైన సీపీఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ పార్టీల నేతలు అల్లు అర్జున్ కు వత్తాసు గా మాట్లాడటం నీచమని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం రాజకీయ నేతలు సినిమా హీరోలకు ఊడిగం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సంధ్యా థియేటర్ ఘటనలో కనీస మానవత్వంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా రూ.వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా హీరోకి
వత్తాసు పలకటం ఏంటని నిలదీసారు.
సినీ ప్రముఖులు చేస్తుందేంటి
పుష్ప-2 సినిమా టిక్కెట్ ధర రూ.1200లకు పెంచడం దారుమని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
సినిమా విడుదల చేస్తున్న సమయంలో టిక్కెట్లు ఎక్కువ రేటుకు విక్రయించేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్న తీరు ప్రజలకు నష్టం చేయటమేనని విమర్శించారు. తొక్కిస లాట జరిగి ఒక మహిళ మృతి చెందితే స్పందించని సినీ ప్రముఖులు.. హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే సినీ ఇండస్ట్రీ కుప్పకూలినట్లు వ్యవహరించిన తీరు నిసిగ్గుగా ఉందని సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడే రైతులు పంట పండిస్తూ మద్దతు ధర కల్పించాలంటూ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న స్పందించని రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా టిక్కెట్లు ధరలు పెంచుకుంటానికి ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications