'నారా లోకేష్, మంత్రి కేటీఆర్‌లు హైక్లాస్ బిచ్చగాళ్లు'
హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టాలని సీపీఐ నేత నారాయణ సోమవారం అన్నారు. శేషాచలం ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన వారంతా కూలీలే అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
శేషాచలం ఘటన, జేఎన్టీయూ (కాకినాడ)లో అక్రమాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై సోమవారం గవర్నర్ నరసింహన్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయా అంశాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం, ఇప్పుడు ఏవేవో సాకులు చెబుతోందన్నారు.
ఈ విషయంలో చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. భూసేకరణ బిల్లు పైన 147వ తేదీన ఆందోళన నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పిన కేంద్రం ఆచరణలో మాత్రం అలా వ్యవహరించడం లేదన్నారు.

'నారా లోకేష్, కేటీఆర్‌లు హైక్లాస్ బిచ్చగాళ్లు'
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయులు నారా లోకేష్, కల్వకుంట్ల తారక రామారావులు హైక్లాస్ బెగ్గర్స్ అని సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ల విదేశఈ పర్యటనలపై ఆయన ధ్వజమెత్తారు.
మంగళవారం ఆయన తిరుపతిలో మాట్లాడారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు లాక్కొని రాజధానిని నిర్మిస్తే అది శ్మాశానం నిర్మించినట్లే అవుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య దారుణమన్నారు. శేషాచలం అడవుల్లో చనిపోయిన వారంతా కూలీలే అన్నారు. వారు స్మగ్లర్లు అని చంద్రబాబు నిరూపించగలరా అని నిలదీశారు.
జగన్ పైన కాల్వ మండిపాటు
అనంతపురం జిల్లాలో పాతపక్షల నేపథ్యంలో ప్రసాద్ రెడ్డి హత్య జరిగిందని, దీనిని జగన్ రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వేరుగా మండిపడ్డారు. 2003లో ప్రసాన్నాయపల్లెలో జరిగిన ముగ్గురి హత్య కేసులో ప్రసాద్ రెడ్డి ప్రధాన నిందితుడు అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 228 మంది టీడీపీ కార్యకర్తలను అంతమొందించారని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 58 మంది టీడీపీ నేతలు హత్యకు గురయ్యారన్నారు. టీడీపీ నాటి ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర తనకు ప్రాణహానీ ఉందని ఎన్నిసార్లు చెప్పినా రక్షణ కల్పించలేదని, చివరకు ఆయనను పార్టీ కార్యాలయంలోనే హత్య చేశారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications