అలా చేస్తే మోడీతో మళ్లీ చేతులు కలుపుతారు: చంద్రబాబుపై రామకృష్ణ ఫైర్
Recommended Video

విజయవాడ: నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిందేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి మోడీతో స్నేహహస్తం కోసం చంద్రబాబు చేతులు కలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపర్చడమేనని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చంద్రబాబు ఎంచుకున్న పోరాట పంథా ఇదేనా? అంటూ రామకృష్ణ నిలదీశారు. మోడీ ఎడమ చెయ్యి ఇస్తేనే చంద్రబాబు ఎగిరి గంతులేశారని, అదే పొరపాటున కుడి చెయ్యి ఇస్తే ఆయన కింద నిల్చేవాడే కాదని ఎద్దేవా చేశారు.

గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనతో భూగోళం బద్దలవుబోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసిందని,చివరికీ ఏం జరిగిందో అందరూ చూశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చంద్రబాబు మోసపూరిత మాటలు, మోసపూరిత పర్యటనలు మానుకోవాలని హితవు పలికారు.
కాగా, అర్హులకు రేషన్ కార్డులు, పక్కాగృహాలు, ఇళ్లస్థలాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ గుంటూరులో నిర్వహించిన సామూహిక దరఖాస్తుల సమర్పణ కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నాలుగేళ్లలో 20 లక్షల పక్కా గృహాలు కట్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కనీసం 2 లక్షల ఇళ్లను కూడా కట్టించలేదని తెలిపారు.
చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం పోలవరానికి రూ.5వేల కోట్లు, రాజధాని అమరావతికి రూ.2 వేల కోట్లు ఇస్తే.. చంద్రబాబు మళ్లీ మోడీతో చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రామకృష్ణ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications