CPPS Exit poll: నో డౌట్.. ఏపీలో ఆ పార్టీకి 100 ప్లస్
దేశవ్యాప్తంగా చివరి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడటం ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల అవుతున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
తాజాగా ఏపీపై తన ఎగ్జిట్ పోల్ అంచనాలను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సంస్థ. ఎవరు అధికారంలోకి వస్తారనేది తేల్చి చెప్పింది. ఏపీలో వరుసగా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని పేర్కొంది.

అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి 95 నుంచి 105 స్థానాలు లభిస్తాయి. మెజారిటీ లోక్‌సభ నియోజకవర్గాలను కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంటుందని అంచనా వేసింది. 14 నుంచి 17 లోక్‌సభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని అభిప్రాయపడింది. 2019 నాటి ఎన్నికల్లో లోక్‌సభలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించినట్టుగా ఈ సారి ఉండదని తెలిపింది.
వైసీపీకి పడే ఓట్ల శాతం 49 వరకు ఉంటుంది. ఇందులో అత్యధికంగా మహిళలు అధికార పార్టీకి ఓటు వేసినట్లు పేర్కొంది. వారితో పాటు మెజారిటీ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటుబ్యాంక్ వైసీపీ వైపే మొగ్గు చూపిందనేది సీపీపీఎస్ సర్వే ద్వారా స్పష్టమౌతోంది.
తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి 75 నుంచి 85 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి. లోక్‌సభలో 8 నుంచి 11 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ కూటమికి పడే ఓట్ల శాతం 47 శాతం వరకు ఉండొచ్చు. పురుషులతో పోల్చుకుంటే మహిళల ఓట్లే వైఎస్ఆర్సీపీకి అధికారాన్ని అందజేస్తాయని తేలింది. కాంగ్రెస్‌కు మూడు శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది.












Click it and Unblock the Notifications