చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరదలతో పంట నష్టం రూ 3,300 కోట్లు - కర్నూలులో భిన్నంగా : ప్రభుత్వం మందుకొచ్చేనా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో భారీ వర్షాలు..వరదలతో ఊహించని విధంగా రైతులు నష్టపోయారు. దాదాపుగా రూ 3,300 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేసారు. నవంబరు నెలలో కురిసిన వానలకు ప్రభుత్వ అంచనాల ప్రకారమే 13 జిల్లాల్లో 13.24 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. అంతకుముందు జూన్‌ నుంచి అక్టోబరు వరకూ జరిగిన నష్టమూ భారీగానే ఉంది. డపోత వానలకు అనంతపురం, చిత్తూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో పశువుల మేతకూ పనికిరాని విధంగా దెబ్బతింది. మరోపక్క ఆశించిన వర్షాల్లేక కర్నూలు జిల్లాలో దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో గులాబ్‌ తుపాను ధాటికి వరితో పాటు ఇతర పంటలూ పాడయ్యాయి.

వైరస్‌, తామరపురుగు మిరప మొక్కల్ని పీల్చివేస్తుండటంతో రైతులు పంటనే దున్నేస్తున్నారు. దెబ్బమీద దెబ్బలా నవంబరులో కురిసిన వానలు సాంతం ఊడ్చిపెట్టేశాయి. త దశలో ఉన్న వరి 6.10 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. రైతులు ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టగా.. గింజ కూడా చేతికిరాని వారు లక్షల్లో ఉన్నారు. కడప, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల నేలవాలింది. రబీలో ప్రధాన పంటగా సాగయ్యే సెనగ నవంబరు మొదటి, రెండో వారంలో కురిసిన వానలకు కుళ్లిపోయింది.

నవంబరు మూడో వారంలో ముంచెత్తిన వానలు, వరదలకు కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీగా నష్టం కలిగింది. రబీలో వరి తర్వాత ప్రధాన పంట సెనగ. నవంబరులో కురిసిన వానలకు మొలక దశలోనే కుళ్లిపోయింది. సాగుకు ఎకరాకు రూ.10వేల వరకు ఖర్చయ్యింది. దీనికి ఇంకా ఈ-క్రాప్‌ కూడా నమోదుకాలేదు. కడప జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో విత్తనం వేశారు. మిరప సాగు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అధికం. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది సాగు పెరిగింది. రైతులు ఎకరాకు రూ.70వేల నుంచి రూ.90 వేల వరకు వెచ్చించారు.

Crop damage neary value of rs 3300 cr due to flash floods and heavy rains in AP

తెగుళ్ల నివారణకు పురుగు మందులు చల్లుతున్న దశలోనే వర్షాల కారణంగా దెబ్బతింది. అనంతపురం జిల్లాలోనే సుమారు 11వేల ఎకరాల వరకు పాడైనట్లు అంచనా. పలుచోట్ల పంటల్ని దున్నేస్తున్నారు.పంటనష్టం కింద నమోదు చేయలేదని, బీమా వస్తుందో లేదోనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం విత్తనాలను మాత్రమే రాయితీపై ఇస్తోంది. రైతులు మళ్లీ సెనగ వేసేందుకు రెండోసారి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.

Recommended Video

Chandrababu Cried Issue : Vallabhaneni Vamsi Apologizes || Oneindia Telugu

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి 6.10 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. ఈ క్రాప్ ద్వారా జరిగిన పంట నష్టం గుర్తించామని.. రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ క్రాప్ కూడా నమోదు కాకపోవటంతో రైతుల్లో మరింత ఆందోళన పెంచుతోంది. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన రైతులు ఆశగా చూస్తున్నారు.

English summary
Crop damage neary value of rs 3,300 cr due to flash floods and heavy rains in the last week of november.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X