పంచదార్ల కొండపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం- బిగ్ చెక్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఓ ముందడుగు వేసింది. వివాదాస్పందగా మారిన అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండ సంరరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమికి చెందిన కొందరు నేతలు ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించిన నేపథ్యంలో ఈ దిశగా చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పంచదార్ల కొండ పరిధిని పూర్తిస్థాయిలో నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొండప్రాంతంలో కొంతకాలంగా సాగుతున్న అక్రమ మైనింగ్, క్వారీయింగ్ అంశంపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో రాజీపడొద్దని సూచించింది.

Crucial Move by AP Government with Strict Ban on Mining at Panchadharla Hill Declares a No Mining Zone

పర్యావరణ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి గత కొద్దిరోజులుగా పంచదార్ల కొండ పరిసరాల్లో కొందరు అక్రమార్కులు యంత్రాలతో భారీ తవ్వకాలు జరుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గనుల తవ్వకాల్లో వాడే పేలుడు పదార్థాల ధాటికి స్థానికంగా తీవ్ర కాలుష్య సమస్యలు ఉత్పన్నమవడమే కాకుండా, భూగర్భ జలాలు కూడా ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం.. కొండ సహజ ఉనికిని కాపాడేందుకు మైనింగ్ కార్యకలాపాలపై తక్షణమే పూర్తి స్థాయి నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

టీమిండియాపై సెంచరీ బాదిన శ్రీలంక బ్యాటర్- ఫాలో ఆన్ ఆడుతూ చుక్కలు చూపించాడు
టీమిండియాపై సెంచరీ బాదిన శ్రీలంక బ్యాటర్- ఫాలో ఆన్ ఆడుతూ చుక్కలు చూపించాడు

పంచధార్ల కొండకు ఘన చరిత్ర ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. కొండపై నుంచి అయిదు వేర్వేరు దిశల నుంచి నిరంతరాయంగా ప్రవహించే సహజ సిద్ధమైన అయిదు నీటి ధారల వల్లే ఈ క్షేత్రానికి పంచధార్ల అనే పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడి పురాతన శ్రీ ధర్మలింగేశ్వర స్వామి దేవాలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇటువంటి ప్రాచీన ఆలయ కట్టడాలకు మైనింగ్ బ్లాస్టింగ్‌ల వల్ల శాశ్వతంగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.

స్కూళ్లు, కాలేజీలు, ఫీజుల స్ట్రక్చర్ పై సీఎం డీకే శివకుమార్ తాజా నిర్ణయాలు
స్కూళ్లు, కాలేజీలు, ఫీజుల స్ట్రక్చర్ పై సీఎం డీకే శివకుమార్ తాజా నిర్ణయాలు

ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం పంచధార్ల కొండ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి నూతన మైనింగ్ లీజుల మంజూరుకు అనుమతులు ఉండవు. గతంలో ఇచ్చిన తాత్కాలిక తవ్వకాల అనుమతులను కూడా వెంటనే సమీక్షించి, వాటిని రద్దు చేయనున్నారు. అటవీ, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల సమన్వయంతో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ఇక్కడ నిరంతర నిఘా ఉంచనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+