Cyclone Ditwah: దిత్వా తుపాన్ ఎఫెక్ట్-గుంటూరు ప్రజలకు పోలీసుల అలర్ట్..!
దిత్వా తుపాన్ ఏపీ తీరాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా చెన్నై నుంచి ఏపీ తీర వ్యాప్తంగా ఇప్పటికే భారీ గాలులు వీస్తున్నాయి. చెన్నై సమీపంలో తుపాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఆ ప్రభావం గుంటూరు జిల్లా వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు గుంటూరు జిల్లా పోలీసులు అలర్ట్ జారీ చేశారు. అలాగే అత్యవసర సాయం కోసం కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు.
దిత్వా తుపాను ప్రభావం దృష్ట్యా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరపున కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి, వారికి సహాయక చర్యలు అందించటానికి గుంటూరు జిల్లాలో ప్రతి పోలీస్ సబ్ డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలీస్ సబ్‌డివిజన్‌ల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు:
- ఈస్ట్ సబ్‌డివిజన్ - ☎ 0863-2223353
- వెస్ట్ సబ్‌డివిజన్ - ☎ 0863-2241152 / 0863-2259301
- నార్త్ సబ్‌డివిజన్ - ☎ 08645-237099
- సౌత్ సబ్‌డివిజన్ - ☎ 0863-2320136
- తెనాలి సబ్‌డివిజన్ - ☎ 08644-225829
- తుళ్లూరు సబ్‌డివిజన్ - ☎ 08645-243265
జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: ☎ 0863-2230100
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదకర వంతెనలు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన రహదారులు, రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అత్యవసర స్పందన బృందాలను నియమించామన్నారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప గృహాల నుండి బయటకు రాకుండా పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరఫున తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, ముంపు ముప్పు ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని స్థాయిల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు.

కాబట్టి తుపాను సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావద్దని ప్రజల్ని ఎస్పీ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించాలన్నారు. భద్రత కోసం గుంటూరు జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు విధి నిర్వహణలో ఉంటుందని వెల్లడించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications