Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దూసుకొస్తున్న ఫైలిన్: భయం గుప్పిట్లో (పిక్చర్స్)

హైదరాబాద్: ఫైలిన్ తుపాను దూసుకొస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శనివారం ఉదయం పైలిన్ పశ్చిమ మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 400 కిలీమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గోపాల్‌పూర్‌కు అగ్నేయంగా 400 కిలోమీటర్లు, కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 410 కిలోమీటర్ల దూరంలో ఉంది. శనివారం రాత్రికి ఇచ్చాపురం లేదా కళింగపట్నం వద్ద తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

శుక్రవారం సాయంత్రానికే సముద్రం 40-50 అడుగుల ముందుకు దూసుకొచ్చింది. అలలు నాలుగైదు అడుగుల ఎత్తున ఎగసి పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ భారీ వర్షాలు, ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి దేశవ్యాప్తంగా 12 ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన పరదీప్ పోర్టును శుక్రవారం మూసివేశారు. తుఫాను తీరం దిశగా వస్తున్న కొద్దీ తీవ్రత పెరుగుతోంది.

లండన్‌కు చెందిన ట్రాపికల్ స్ట్రార్మ్, అమెరికా నౌకాదళ వాతావరణ కేంద్రం మాత్రం దీనిని 'సూపర్ సైక్లోన్'గా అభివర్ణించాయి. 2005లో అమెరికాను అతలాకుతలం చేసిన 'హరికేన్ కత్రినా' కంటే తీవ్రమని ప్రకటించాయి. "ఐఎండీ అంచనా కంటే దారుణంగా ఫైలిన్ ఉంది. ఇటీవలి ఉపగ్రహ ఛాయాచిత్రం ప్రకారం చూస్తే.. హరికేన్ కత్రినాతో సమానంగా ఉంది.భూమిపైనే అత్యంత చండ ప్రచండమైన తుఫానుతో సమానం. ఇప్పటి వరకు వచ్చిన తుఫానుల్లో ఇదే అత్యంత భయంకరమైనది కావచ్చు'' అని అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు ఎరిక్ హాల్తస్ చెప్పారు.

తీవ్రమైన ఈదురుగాలులు

తీవ్రమైన ఈదురుగాలులు

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 210-220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. కాగా 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయవచ్చని అమెరికా నౌకా దళ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రాకాసి అలలు

రాకాసి అలలు

తుఫాను తీరం దాటే సమయంలో అలలు 8-10 అడుగుల ఎత్తున విరుచుకుపడుతాయని చెబుతున్నారు. దీంతో, శ్రీకాకుళం, దక్షిణ ఒడిషాలోని నాలుగు జిల్లాలు ముంపునకు గురవుతాయి. అమెరికా వాతావరణ కేంద్రం మాత్రం 54 అడుగుల ఎత్తున అలలు విరుచుకుపడనున్నాయని ప్రకటించింది.

ఐదు జిల్లాలకు అలర్ట్

ఐదు జిల్లాలకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్, ఒడిషాల్లో ఐదు జిల్లాలకు పెను ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఒడిషాలోని గంజాం, పూరీ, ఖుర్దా, జగత్సింగ్‌పూర్ తుఫానుతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.

మహా కుండపోత

మహా కుండపోత

తుఫాను తీరం దాటే సమయంలో 25 సెంటీమీటర్లపైనే అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఒడిషాలో అయితే అతి భయంకరంగా కురవనున్నాయి. తీవ్ర విధ్వంసం జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లే

ప్రమాద హెచ్చరికలు

ప్రమాద హెచ్చరికలు

ఒడిషాలోని పలు ఓడరేవుల్లో పదో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

విశాఖకు రఘువీరా రెడ్డి

విశాఖకు రఘువీరా రెడ్డి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి శనివారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు.

రాష్ట్రంలో మూడు జిల్లాలు..

రాష్ట్రంలో మూడు జిల్లాలు..

తుఫాను తీవ్రత శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉంటుందని, దాని ప్రభావం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై కూడా ఉంటుందని చెబుతున్నారు.

పునరావాసం ముమ్మరం..

పునరావాసం ముమ్మరం..

రాష్ట్రంలో అధికారులు ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లాలో 40 వేల మందిని, శ్రీకాకుళం జిల్లాలో 20 వేల మందిని, విజయనగరం జిల్లాలో 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రక్షణ దళాలు సిద్ధం..

రక్షణ దళాలు సిద్ధం..

సహాయక చర్యలు చేపట్టడానికి నావికా, సైనిక, వైమానిక దళాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి శనివారంనాడు చెప్పారు.

సూపర్ సైక్లోన్‌గానే..

సూపర్ సైక్లోన్‌గానే..

ఫైలిన్‌ను తాము సూపర్ సైక్లోన్‌గానే పరిగణిస్తున్నామని ఒడిసా విపత్తు నిర్వహణ కమిషనర్ పీకే మహాపాత్రా శుక్రవారంనాడు తెలిపారు. కానీ, మన భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మాత్రం ఇది 'సూపర్ సైక్లోన్' కాకపోవచ్చని అంచనా వేసింది.

రెడ్ అలర్ట్1

రెడ్ అలర్ట్1

1999లో ఒడిసాను ఊడ్చేసిన సూపర్ సైక్లోన్ అంతటి ప్రభావం ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కానీ, రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ప్రచండ గాలులు..

ప్రచండ గాలులు..

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ చెప్పారు.

వణుకుతున్న ప్రజలు

వణుకుతున్న ప్రజలు

పైలిన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. దాని తీవ్రత ఎక్కువగా ఉండవచ్చునని భయాందోళనలకు గురవుతున్నారు.

ఓడరేవుల్లో హెచ్చరికలు

ఓడరేవుల్లో హెచ్చరికలు

ఒడిషాలోని అన్ని ఓడరేవుల్లో పదో నెంబరు ప్రమాద హెచ్చరికలను ఎగుర వేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలలో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగుర వేశారు.

ప్రయాణాల నియంత్రణ

ప్రయాణాల నియంత్రణ

కాకినాడ, గంగవరం రేవుల్లో మూడో నంబర్‌తోపాటు సెక్షన్ సిగ్నల్-3 ఎగురవేశారు. రైలు, రోడ్డు మార్గాల్లో ప్రయాణాలను నియంత్రించాలని ఐఎండీ సూచించింది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+