ఎలా పంపిస్తారు?: కిరణ్‌పై డిఎస్, డికె అరుణ నిప్పులు
అదిలాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు బుధవారం మండిపడ్డారు. అదిలాబాద్ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ కృతజ్ఞత సభలో శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్, మంత్రి డికె అరుణ తదితరులు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎవరినీ సంప్రదించకుండా కేంద్రానికి ప్రభుత్వం తరఫున నివేదిక పంపించడం సరికాదన్నారు. ఆయన నివేదికను ఎవరూ పట్టించుకోరన్నారు.
కిరణ్ అయినా మరెవరైనా సిడబ్ల్యూసి నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు. సామాజిక తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా చేద్దామన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసే నాయకత్వం మనకు ఉందన్నారు. పార్టీలను నివేదిక ఇవ్వాలని జివోఎం కోరిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రకటన 30 జూలైన చేసింది కాదని, డిసెంబర్ 9, 2009న తీసుకున్న నిర్ణయమేనని అన్నారు. నాడు పలువురు విభజనకు అడ్డుపడ్డారని విమర్శించారు. తెలంగాణపై మూడు నెలల క్రితమే కొత్తగా ప్రకటన చేయలేదన్నారు. నాడు పార్లమెంటులోనే ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎవరి ప్రమేయం లేదని, సోనియా గాంధీ మాత్రమే ఇచ్చారని డిఎస్ తెరాసను ఉద్దేశించి చెప్పారు.
ఫోటో పెట్టనివ్వం: పొన్నం
తెలంగాణలో రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీని పెట్టనివ్వమని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ మంత్రుల అభిప్రాయాలు తీసుకోకుండా ఆయన తప్పుడు నివేదికలు పంపించారని ఆరోపించారు.
సిఎం ఎలా పంపిస్తారు: డికె అరుణ
తెలంగాణ మంత్రుల అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఎలా పంపుతారని మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. వచ్చేది సామాజిక తెలంగాణ అని, బహుజనులకు న్యాయం జరుగుతుందన్నారు. పొత్తుల పైన తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తన వైఖరి స్పష్టం చేయాలన్నారు.
ఆదుకుంటాం: షబ్బీర్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెస్ షబ్బీర్ అలీ అన్నారు.
టిడిపి ఎందుకు వెళ్లలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
అఖిల పక్షాన్ని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ జివోఎం భేటీకి ఎందుకు వెళ్లలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. టిడిపి తెలంగాణకు అనుకూలమైతే జివోఎంకు వెళ్లాల్సి ఉండెనన్నారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications