Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుతో వైరాన్ని అంగీకరించిన దగ్గుబాటి ..! ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన తన పుస్తకం "ప్రపంచ చరిత్ర" ఆవిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి గతంలో చంద్రబాబుతో ఉన్న గ్యాప్ ఇప్పుడు లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ బీజేపీ ఛీఫ్ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు చంద్రబాబు కూడా హాజరయ్యారు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన దగ్గర డబ్బుల్లేకపోవడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పిన విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. గతంలో మద్రాస్, ఒడిశా, కర్నాటక నుంచి ఏపీ ఎలా విడిపోయిందన్న అంశాన్ని ఓ పుస్తకరూపంలో రాసి ఎమ్మెల్యేలకు పంచిన విషయాన్ని వెల్లడించారు. తాను ఎన్నో విదేశీ పర్యటనలు చేశానని, ఈ సందర్భంగా తెలుసుకున్న అంశాల్ని క్రోడీకరించి ఇప్పుడు ప్రపంచ చరిత్ర పుస్తకం రాసినట్లు తెలిపారు.

Daggubati venkateswara rao interesting comments on co-brother Chandrababu on his book launch

తోడల్లుడు చంద్రబాబును ఉద్దేశించి దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఏఐ రాకతో వచ్చే 50 ఏళ్లు ఎలా బతకొచ్చో మెకానిజం వచ్చేస్తుందన్నారు. ఈ విషయం చెబుతూ మధ్యలో చంద్రబాబును ప్రస్తావించారు. చంద్రబాబు గారూ.. 50 ఏళ్లు బతకొచ్చట, మీరు మరో 50 ఏళ్లు బతికితే మీ అబ్బాయి (లోకేష్) బాధపడతాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే తనకూ, చంద్రబాబుకూ వైరం ఉందని చెప్తుంటారని, కానీ అది వాస్తవమే అని దగ్గుబాటి తెలిపారు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదని, అవన్నీ మర్చిపోయి ముందుకు వెళ్తుండాలన్నారు. తనకు మాత్రం ఎలాంటి కోరికలు లేవన్నారు. తన కుటుంబం, స్నేహితులు, పది మందితో కలిసి ఉండాలనేదే తన కోరికన్నారు.

Take a Poll

ఆ తర్వాత దగ్గుబాటి గురించి చంద్రబాబు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ గా ఉన్నప్పుడు దగ్గుబాటి ప్రాక్టీస్ చేయలేదని, కానీ వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉండి ప్రాక్టీస్ చేశారన్నారు. డాక్టర్ గా చేసి సినిమాలు మాత్రం తీశాడన్నారు. జీవితంలా ఎలా ఉంటారనే దానికి ఇదో ఉదాహరణ అన్నారు. ప్రజా జీవితంలో ఎన్నో పదవుల్లో దగ్గుబాటి పనిచేశారని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా చాలా రిలాక్స్ గా , జోవియల్ గా ఉండే వ్యక్తి దగ్గుబాటి అన్నారు. ఇటీవల తాను ఆయన్ను కలిసినప్పుడు హఠాత్తుగా రాజకీయాలు వదిలేసి ఎలా గడుపుతున్నారని ప్రశ్నిస్తే.. బ్యాడ్మింటన్, పేకాట, మనవరాళ్లతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నానన్నారు. వాట్ ఏ వండర్ ఫుల్ లైఫ్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+