Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కు షాక్ ఇవ్వటానికి సిద్ధం అయిన దగ్గుపాటి .. వైసీపీ అల్టిమేటానికి సమాధానం ఇదేనా ?

ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాలలో త్వరలో మార్పులు చోటు చేసుకుంటాయని పెద్ద చర్చ నడుస్తుంది. ఏదో ఒక పార్టీలోనే ఉండాలని దగ్గుపాటి ఫ్యామిలీ విషయంలో వైసీపీ అల్టిమేటం ఇచ్చిన నేపధ్యంలోనే మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తుంది. దగ్గుపాటి కి అల్టిమేటం జారీ చేసిన నేపధ్యంలో ఆయన జగన్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలని డిసైడ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

దగ్గుపాటికి వైసీపీ అల్టిమేటం ..పార్టీలో తగ్గిన ప్రాధాన్యం

దగ్గుపాటికి వైసీపీ అల్టిమేటం ..పార్టీలో తగ్గిన ప్రాధాన్యం

గత ఎన్నికల ముందు వైసీపీలోకి చేరి చక్రం తిప్పాలని , చంద్రబాబుకు చెక్ పెట్టాలని చూసిన దగ్గుపాటి వెంకటేశ్వర్ రావు ఊహించని విధంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు . గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు దగ్గుపాటి ఆయన తనయుడు హితేష్ చెంచురాం . హితేష్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని మొదట భావించినా హితేష్ చెంచురాం పౌరసత్వానికి సంబంధించిన సమస్య రావటంతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. ఎప్పుడూ ఓటమి అంటే ఏమిటో తెలియని దగ్గుపాటి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ నుండి పోటీ చేసి కూడా ఆయన ఎదురు దెబ్బ తిన్నారు. ఇక అప్పటి నుండి దగ్గుపాటికి పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది . దగ్గుపాటి వల్ల పార్టీలో కీలక నేతలు ఇబ్బంది పడుతున్నారన్న వార్తల నేపధ్యంలోనే వైసీపీ ఆయన విషయంలో అల్టిమేటం జారీ చేసి సీరియస్ గా నిర్ణయం తీసుకుంది.

పురంధరేశ్వరితో కలిసి బీజేపీ పెద్దలను కలిసిన దగ్గుపాటి

పురంధరేశ్వరితో కలిసి బీజేపీ పెద్దలను కలిసిన దగ్గుపాటి

ఇక బీజేపీలో ఉన్న పురంధరేశ్వరిని పార్టీ మార్చాలని , వైసీపీలోకి తీసుకురావాలని దగ్గుపాటిపై ఒత్తిడి తెస్తుంది వైసీపీ . కానీ పురంధరేశ్వరి కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీని వీడి వైసీపీ లోకి వచ్చే ఆలోచనలో లేరు. అంతే కాదు దగ్గుపాటిని సైతం బీజేపీలో చేర్పించే ఆలోచనలో ఉన్నారు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి . ఇక అందులో భాగంగా ఆమె తన భర్త దగ్గుపాటితో కలిసి ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కలిసినట్టు సమాచారం. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని దగ్గుపాటి వెంకటేశ్వరరావు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తుంది. అందుకు సంబంధించిన చర్చలు సైతం కేంద్ర పెద్దలతో చేసినట్టు సమాచారం.

జాతీయ పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావిస్తున్న దగ్గుపాటి ఫ్యామిలీ

జాతీయ పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావిస్తున్న దగ్గుపాటి ఫ్యామిలీ

దగ్గుపాటి ఫ్యామిలీ రెండు పార్టీల రాజకీయంపై వైసీపీ గత కొంతకాలంగా అసహనంతోనే ఉంది . ఇప్పుడు గత ఎన్నికల్లో దగ్గుపాటి ఓటమిపాలు కావటం ఒక కారణం అయితే, పురంధరేశ్వరి జగన్ పై విమర్శలు చేస్తుండటం మరో కారణం, ఇక అన్నిటికంటే గత ఎన్నికల ముందు దగ్గుపాటి రాకను వ్యతిరేకించి వెళ్ళిపోయిన రామనాధం రీ ఎంట్రీ అన్నిటికంటే కీలక కారణం . ఇన్ని కారణాలతో ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని అదే పార్టీలో ఫ్యామిలీ కొనసాగాలని దగ్గుపాటిపై ఒత్తిడి తెస్తోంది వైసీపీ అధిష్టానం . పురంధరేశ్వరిని వైసీపీ లోకి తీసుకురావాలని బాగానే ఒత్తిడి తెచ్చింది. అయితే పురంధరేశ్వరి మాత్రం జాతీయ పార్టీ తోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావించి భర్తను బీజేపీలో చేరాలని సూచించారని సమాచారం.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరే ఆలోచనలో దగ్గుపాటి

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరే ఆలోచనలో దగ్గుపాటి

ఇక జగన్ , వైసీపీ నేతలు కోరినట్టు పురంధరేశ్వరి అంత ఈజీగా బీజేపీని వీడి వచ్చే ఆలోచనలో లేరు. జాతీయ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, గతంలోనూ కేంద్రంలో మహిళా కీలక నేతగా ఉన్న పురంధరేశ్వరికి బీజేపీ ఏదైనా మంచి అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది అని దగ్గుపాటి కుటుంబం భావిస్తుంది. ఇక ఈనేపధ్యంలో ఆమె బీజేపీని వీడే ఛాన్స్ లేదు. ఇక ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్ తో తేల్చుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో పొమ్మనకుండా పొగ పెట్టారని భావిస్తున్న నేపధ్యంలోనే జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

జగన్ కు షాక్ ఇవ్వనున్న దగ్గుపాటి ఫ్యామిలీ

జగన్ కు షాక్ ఇవ్వనున్న దగ్గుపాటి ఫ్యామిలీ

దగ్గుపాటి గతంలో బీజేపీలో పని చేశారు . వైసీపీ లో ఉన్న తాజా ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలో వైసీపీలో మనుగడ సాగించటం కష్టం అని భావిస్తున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . జగన్ పార్టీ దగ్గుపాటికి అల్టిమేటం జారీ చేస్తే జగన్ కు దానికి సమాధానంగా దగ్గుపాటి ఫ్యామిలీ షాక్ ఇవ్వనున్నారని తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది. ఏది ఏమైనా వైసీపీ నాయకులు కోరుకున్నది అదే .. జరుగుతుంది అదే అని జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+