వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాస్ తుపాను వల్ల ప్రమాదమే.!తాజా చిత్రాలు విడుదల చేసిన వాతావరణ సంస్థ.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: యాస్ తుపాను తెలుగు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తింస్తోంది. ఇప్పటికే మూడు రోజుల పాటు ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. యాస్ ప్రభావంతో ఏపీలో మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడబోతున్నాయని తెలిసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణకోస్తాలో భారీ వర్షాలతో పాటు తెలంగాణ పై దీని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నయని తెలుస్తోంది.

రాయలసీమలో తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తూర్పు తీరం దిశగా దూసుకొస్తున్న యాస్ తుపాను, ఈ నెల 26న తీరం చేరనున్న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. యాస్ తుపానుకు సంబందించిన తాజా ఉపగ్రహ చిత్రాలను ఐఎండీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.

Danger due to Yaas storm.!Weather department releasing latest pictures.!

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను తీరం దిశగా దూసుకువస్తోంది. యాస్ తుపాను రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా, ఆపై అతి తీవ్ర తుపానుగా బలపడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం యాస్ ఒడిశాలోని పరదీప్ కు దక్షిణ ఆగ్నేయదిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఇది ఈ నెల 26 మధ్యాహ్నం పరదీప్, సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది.

ఇక యాస్ తుపాను ప్రభావంతో ఏపీలో రాగల మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటేటప్పుడు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని వివరించింది. యాస్ తుపాను తీవ్రత కారణంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. సముద్ర తీరం, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ మెచ్చరికలు జారీ చేసింది.

English summary
Typhoon Yaas, which formed in the Bay of Bengal, is heading towards the coast. The Indian Meteorological Department (IMD) has said that Yaas will intensify into a severe cyclone within 12 hours of its onset and then become a severe cyclone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X