రేపు ముద్రగడ ఇంటికి దాసరి: 1500 మంది టిడిపికి రాజీనామా, 'ప్రభుత్వాన్ని కూల్చేస్తాం'
చిత్తూరు: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు దర్శకరత్న దాసరి నారాయణ రావు మద్దతు పలికారు. సోమవారం నాడు ఆయన కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలపనున్నారు. ముద్రగడ దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే.
ముద్రగడ దీక్షకు మద్దతుగా 1500 మంది టిడిపికి రాజీనామా
ముద్రగడ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆ దీక్షకు సంఘీబావంగా 1500 మంది టిడిపికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరుతామని వారు చెప్పారని తెలుస్తోంది.

బీసీ సంఘాల హెచ్చరిక
ఓ వైపు కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ముద్రగడ పద్మనాభం మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పతిప్తాడు మండలంలోని ఆయన సొంతూరు కిర్లంపూడిలో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో కాపులకు రిజర్వేషన్లు వద్దంటూ రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక రంగంలోకి దిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్ని కలిసి 'రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక' పేరిట ఏకమయ్యాయి. వేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం తిరుపతిలో జరిగింది.
ఈ సందర్భంగా వేదిక నేతలు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ది చెందిన కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వాన్ని కూలదోస్తామని కూడా వారు హెచ్చరించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications