ఆంధ్రాకు పాకిన పరువు హత్యల సంస్కృతి....రాజమండ్రిలో కూతురుని చంపేశాడు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

రాజమండ్రి: పరువు హత్యల సంస్కృతి ఆంధ్రాకు కూడా పాకిందా? ఉత్తర భారత దేశంలో సంచలనం సృష్టించిన హానర్ కిల్లింగ్స్ ఎపిలో కూడా మొదలయ్యాయా...తాజాగా రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్నఓ పరువు హత్య ఈ ప్రశ్నలకు తావిస్తోంది.

ఉత్తర భారతదేశం నుంచి పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణాకు పాకి అక్కడ నుంచి ఆంధ్రాలోను అడుగిడినట్లుంది పరువు హత్యల సంస్కృతి. ఇటీవలే కరీంనగర్ లో వేరే మతస్తుడిని ప్రేమించిందని ఓ తండ్రి కుమార్తెను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండలో పరువు పేరుతో కూతురును దారుణంగా హత్యచేశాడో తండ్రి.

daughter was allegedly murdered by her father

ఇంతకీ ఆ కుమార్తె చేసిన నేరం ఇతర కులస్థుడిని ప్రేమించడం. తమ కులం కానివాడిని లవ్ చేస్తోందన్నకోపంతో కూతురి గొంతుకోసి మరీ కిరాతకంగా హతమార్చాడు. అయితే ఇతడు కన్నతండ్రి కాదని పెంపుడు తండ్రి అని స్థానికులు చెబుతున్నారు. హత్యా సంస్కృతికి దూరంగా ఉండే గోదావరి జిల్లాలో ఇంత దారుణమైన హత్య అదీ పరువు పేరుతో తండ్రే కుమార్తెను హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A daughter was allegedly murdered by her father in korukonda of east godavari district .The father killed his daughter with a name of honor. This is the crime committed by father named konda reddy killed his daughter for the reason that she loved other caste boy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి