Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెప్పింది గుర్తు పెట్టుకుని పని చెయ్యండి, డీసీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల ప్రాంతంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను రిపీట్ కాకుండా చూసుకుంటామని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు, స్థానిక ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

విజయనగరం జిల్లాలోని గుర్ల ప్రాంతంలో సోమవారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పీహెమ్ సీలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. డయేరియా వ్యాధి వ్యాప్తి, ఆ వ్యాధికి సంబంధించిన కారణాలపై వైద్య శాఖ అధికారులు నుండి పవన్ కల్యాణ్ వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు.

DCM Pawan Kalyan visited the villages of Vizianagaram district and spoke to the victims

డయేరియా బాధితులకు ఎలాంటి వైద్య చికిత్స అందించాలన్నా మరో ఆలోచన లేకుండా వారికి మెరుగైన చికిత్స అందించాలని, ఆ విషయంలో ఎవ్వరూ నిర్లక్షంగా వ్యవహరించకూడదని విజయనగరం జిల్లా వైద్యశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు నెల్లిమర్ల మండలంలో ఎస్ఎస్ఆర్ పేట వద్ద తాగునీటి పథకాన్ని డీసీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.

DCM Pawan Kalyan visited the villages of Vizianagaram district and spoke to the victims

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో తాగునీటి వ్యవస్థ ఎలా ఉంది అంటూ పవన్ కల్యాణ్ సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. విజయనగరం జిల్లాలో గుర్ల ప్రాంతంలో డయేరియా వ్యాధి వ్యాపించడంతో సంబంధిత అధికారులతో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వైద్య శాఖ అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉందని తెలిసింది. విజయనగరం జిల్లాలో డయేరియా వ్యాధి వ్యాపించడంతో ఇప్పటికే ఏడు మంది చనిపోయారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో తాగునీటి వ్యవస్థ, డ్రైనేజీల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం వలనే గుర్ల ప్రాంతంలో డయేరియా వ్యాధి తాండవం చేసిందని, ఈ పాపం వైసీపీ నాయకులదే అని రెండు రోజుల క్రితం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+