వరద నీటిలో బయట పడుతున్న మృతదేహాలు - ఒక్కరోజే..!!
విజయవాడ ఇంకా విషాదం నుంచి తేరుకోలేదు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే వదరల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వరద నీరు తగ్గుతున్న కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. గంటల వ్యవధిలోనే 12 మృతదేహాలను అధికారులు గుర్తించారు. వరద కారణంగా బయట పడలేని వారు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. అయితే, ఈ సంఖ్య ఏ స్థాయిలో ఉందనేది తేలాలి. తమ వారిని కోల్పోయిన బంధువులు విషాదంలో మునిగిపోయారు.
మృతదేహాలు లభ్యం
విజయవాడలో వరద క్రమేణా తగ్గుతోంది. బుడమేరు ముంపు విజయవాడలో పెను విషాదం మిగిల్చింది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం...భారీ వర్షాలు, వరదల కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. కానీ, అనేక మంది వరద నీటిలో బయట పడలేక ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వరద తగ్గుతోంది. దీంతో...పలు ప్రాంతాల్లో బయట పడుతున్న మృతదేహాలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. ఇంకా పలువురి ఆచూకి గల్లంతు అయినట్లు తెలుస్తోంది.

వరద తగ్గేకొద్దీ
వరద నీటితో సింగ్ నగర్ ప్రాంతం భారీగా నష్టపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నా...ఇంకా కాలనీల్లో ఉన్న వారికి నీరు, పాలు, ఆహారం అందటం లేదు. తమ వద్దకు ఎవరూ రావటం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా బయట పడుతున్న మృతదేహాలతో వరద ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది. కనీసం మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన బంధువులు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది.
పెను విషాదం
గుర్తించిన మృతదేహాలను అధికారులు వారి బంధువులకు అప్పగిస్తున్నారు. ఇంకా వరద నీరు తగ్గితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. నాలుగు రోజుల పాటు కరెంట్, నిత్యావసరాలు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఆహారం అందలేని శివారు కాలనీ ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బుడమేరులో గండి పడిందనే వార్తలతో టెన్షన్ పెరుగుతోంది. ఇక, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంద. దీంతో ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు ప్రారంభించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications