ఏపీలో 54, చెన్నైలో 269 మంది మృతి, వందేళ్ల రికార్డ్: రాజ్, స్వర్ణముఖి ఉధృతి (పిక్చర్స్)
ఒంగోలు/న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 54 మంది, తమిళనాడులో 269 మంది చనిపోయారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోకసభలో ప్రకటించారు. చెన్నై వరదల నేపథ్యంలో ఆయన గురువారం ప్రకటన చేశారు.
భారీ వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తమిళనాడులో పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బయలుదేరారని చెప్పారు. మోడీ ఏరియల్ సర్వే చేస్తారన్నారు. వందేళ్ల తర్వాత రికార్డ్ స్థాయిలో వర్షం నమోదయిందని చెప్పారు.
చెన్నైలో 40 శాతం కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిందన్నారు. చెన్నైలో 30, పుదుచ్చేరిలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని చెప్పారు. వరదల కారణంగా చెన్నై రైల్వే స్టేషన్ మూసివేశారని చెప్పారు.

రాజ్‌నాథ్ సింగ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో వర్షాల విషయమై మాట్లాడామని చెప్పారు. ఏపీలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర బృందం వెళ్తుందని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు అందిస్తోందని చెప్పారు.

భారీ వర్షాలు
ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. రైళ్లు రద్దయ్యాయి.

భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కురిసిన వర్షాలతో ఆయా జిల్లాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది.

భారీ వర్షాలు
నెల్లూరు జిల్లాలో కాళంగి, స్వర్ణముఖి, కైవల్యా నదుల్లో వరద ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. నెల్లూరులో ఓ వ్యక్తి, చిత్తూరులో మరో మహిళ మృతి చెందారు.

భారీ వర్షాలు
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ టిప్పుసుల్తాన్ బంగళాపైకి ఎక్కే మార్గంలో వర్షం నీటికి మట్టి కొట్టుకుపోయి సొరంగం బయటపడింది.

భారీ వర్షాలు
వానల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయ్యింది. ప్రకాశం జిల్లాలో రాళ్లపాడు జలాశయానికి 11వేల క్యూసెక్కుల వరదనీరు రావడంతో అంతే పరిమాణంలో కిందకు విడుదల చేశారు.

స్వర్ణముఖి ఉధృతి
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వానలతో పలుప్రాంతాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. ప్రధానంగా సూళ్లూరుపేట - చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications