డిగ్రీ విద్యార్థిని గొంతు కోసి హత్య, శ్రీవారి భక్తుల మృతి

Degree student killed in Mahaboobnagar district
మహబూబ్‌నగర్/ చిత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం రామానాథపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం కొందరు దుండగులు డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి గొంతుకోసి చంపారు.

గురువారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిన లక్ష్మీదేవిని బైక్‌పై వచ్చిన దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం కోనపురెడ్డిపల్లి దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వెంకన్న భక్తులు మృతి చెందారు. తిరుమలకు నడిచివెళ్తున్న భక్తులపైకి టాటా వింగర్ వాహనం దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పాకాల ఆస్పత్రికి తరలించారు. మృతులు తమిళనాడుకు చెందిన వళ్లి, సెల్వెం, చిన్నరాజు, గణపతిగా పోలీసులు గుర్తించారు. దాదాపు 60 మంది యాత్రికల బృందం కాలినడకన తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+