ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది; అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును జైల్లో పెట్టినట్టుంది: నారా బ్రాహ్మణి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావడం, కనీసం బెయిల్ కూడా దొరకని పరిస్థితుల్లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం, మరోవైపు నారా లోకేష్ కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో విచారణ ఎదుర్కోవటం వంటి పరిణామాలు ఏపీలోని టిడిపి శ్రేణులను కలవరానికి గురి చేస్తున్నాయి.
ఇక ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు కోసం నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి రంగంలోకి దిగారు. వారు చంద్రబాబు కోసం తమ గళం వినిపిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు నిరసనలలో పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో ప్రజలలో చైతన్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

చంద్రబాబు ప్రజలకు మేలు చేశారని, ఏపీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు నారా బ్రాహ్మణి పార్టీ నేతలతో మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణను దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అనేకమార్లు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని, నిత్యం చంద్రబాబు ప్రజల కోసమే తపించారని, ప్రజలకు ఎంతో మేలు చేశారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.
ఇప్పుడు మరో మారు తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ పెట్టిన నారా బ్రాహ్మణి ఏపీని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును జైల్లో పెట్టారా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు పట్ల, జైలులో ఆయనను వేధిస్తున్నారంటూ నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఫైబర్‌నెట్, స్కిల్ ప్రాజెక్టులు ప్రజల కోసం తలపెట్టారు. ప్రజోపయోగ పనులనే నేరాలంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై నిలదీసినందుకు అంగళ్లు కేసు పెట్టారన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు గారు ప్రజలకోసం తలపెట్టిన పనులు. వీటినే నేరాలు అంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్ళు కేసు పెట్టారు.
— Brahmani Nara (@brahmaninara) October 12, 2023
చంద్రబాబుగారి మీద… pic.twitter.com/Jkk36OYB9N
చంద్రబాబుపై కేసులు చూస్తుంటే అభివృద్ధి చేసినందుకే జైల్లో పెట్టినట్టుంది. ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అంతా గ్రహించాలి అని నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజలంతా గమనించాలని నారా బ్రాహ్మణి ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు .












Click it and Unblock the Notifications