ముఖ్యమంత్రి చంద్రబాబు 'తలబద్దలు'పై బీజేపీ కౌంటర్
చంద్రబాబు అసహనంపై బీజేపీ నేత ప్రేమ్ శుక్లా గురువారం స్పందించారు. చంద్రబాబు లాంటి నాయకుడు బాధ్యతారాహిత ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు.
అమరావతి: నోట్ల రద్దు పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. నవంబర్ 8వ తేదీన ప్రధాని మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి దానిని ప్రశంసించారు.
అయితే, నోట్ల రద్దు జరిగి నలభై రోజులు దాటినా ఇంకా సమస్యలు పూర్తిగా తగ్గలేదు. ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అసహనంపై బీజేపీ నేత ప్రేమ్ శుక్లా గురువారం స్పందించారు. చంద్రబాబు లాంటి నాయకుడు బాధ్యతారాహిత ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు.
మరోవైపు, తన వ్యాఖ్యల పైన తప్పుగా ప్రచారం చేశారని చంద్రబాబు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. నోట్ల రద్దు అనంతరం పరిణామాలు, డిటిజలైజేషన్ పైన 13 మందితో కేంద్రం ఓ కమిటీని వేసింది. దీనికి చంద్రబాబు చైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications