నోట్ల రద్దు ఎఫెక్ట్: బ్యాంకు 'క్యూ'లో ప్రాణాలు కోల్పోయిన మరో వ్యక్తి..
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో డబ్బు కోసం బ్యాంకుకి వెళ్లిన కోటయ్య అనే వ్యక్తి క్యూ లైన్ లోనే మృతి చెందాడు.
గుంటూరు: నోట్ల రద్దు ప్రకటించి నెలన్నర రోజులు అయిపోతున్నా.. సామాన్యుల కష్టాలు మాత్రం ఇంకా తీరడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు సామాన్యులంతా గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు. ఈ క్రమంలో స్వల్ప ఘర్షణలతో పాటు, క్యూ లైన్ లోనే కొంతమంది తమ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.

తాజాగా గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో విషాదం చోటుచేసుకుంది. డబ్బు కోసం బ్యాంకుకి వెళ్లి క్యూ లైన్ లో నిలుచున్న కోటయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. క్యూ లైన్ లోనే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో.. అక్కడి ఖాతాదారులంతా తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. కష్టార్జితాన్ని తీసుకునేందుకు కూడా ఇంత తిప్పలు పడాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications