లేడీ లెక్చరర్ మందలింపు: డెంటల్ విద్యార్థి ఆత్మహత్య

కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ లావణ్య మందలించడంతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సంఘటన నేపథ్యంలో దంతవైద్య కళాశాలతోపాటు రిమ్స్ వైద్య విద్యార్థులంతా విధ్వంసానికి దిగారు. రిమ్స్ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మెడికో మృతదేహంతో రిమ్స్ పరిసర ప్రాంతాల్లో శవయాత్ర నిర్వహించారు.
రిమ్స్ అత్యవసర విభాగం ఎదుట మృతదేహాన్ని ఉంచి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కృష్ణచైతన్య ఆత్మహత్యకు బాధ్యురాలైన అధ్యాపకురాలు డాక్టర్ లావణ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి 8గంటల వరకు రిమ్స్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
కృష్ణచైతన్య తన సహ విద్యార్థినితో తరచూ మాట్లాడుతున్నాడంటూ అధ్యాపకురాలు లావణ్య కొన్ని రోజులుగా వేధిస్తున్నారే ఆరోపణలున్నాయి. నందలూరులో ఉన్న కృష్ణచైతన్య తల్లిదండ్రులకు అధ్యాపకురాలు లావణ్య ఫోన్ చేశారు. కృష్ణ చైతన్య చదువుపై శ్రద్ధ చూపడం లేదని, అతనిని ఇంటికి తీసుకెళ్లాలని హుకుం జారీ చేసినట్లు విద్యార్థులు చెప్పారు.












Click it and Unblock the Notifications