బలపడుతున్న అల్పపీడనం...భారీ వర్ష సూచన
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దానిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది వచ్చే 48 గంటల్లో మరింత బలపడుతుందని విశాఖలోని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.
ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రంలో కల్లోలంగా ఉంటుందని వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమప్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని పేర్కొంది. కాగా సెంట్రల్ ఇండియాలో అధికపీడన ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.













Click it and Unblock the Notifications