ఆ మాటకే కట్టుబడి ఉన్న పవన్: వంగలపూడి అనిత రియాక్షన్..!!
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు లోపించాయని, మహిళలు- యువతులపై అత్యాచార ఘటనలు పెరిగిపోతోన్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా 30,000 మంది మహిళలు, యువతులు కనిపించకుండా పోయారంటూ గతంలో ఎన్నికల ప్రచార సభలో తాను చేసిన ఆరోపణలను మళ్లీ గుర్తు చేశారు. గత అయిదు సంవత్సరాల్లో ఇన్ని వేలమంది అమ్మాయిలు అదృశ్యమైతే వాళ్ల గురించి అన్వేషించడం కాదు కదా.. కనీసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం మారిందని, చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో మహిళలు, అమ్మాయిలకు ఎంతో రక్షణ కల్పిస్తోన్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కనిపించకుండా పోయిన 18 మంది యువతులను గాలించడానికి ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం పట్ల విజయవాడ పోలీసులను అభినందించారు.
విజయవాడ పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడాన్ని గర్వంగా భావిస్తోన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ మేరకు తన వ్యక్తిగత అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోస్ట్ చేశారు. వారిని ఆ దిశగా కార్యోన్ముఖులను చేసిన హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకూ శుభాకాంక్షలు చెప్పారాయన.
మహిళలకు రక్షణ కల్పించే విషయంలో చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడబోదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించారు. దీనికోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో మహిళలను కించపర్చడానికి వ్యతిరేకంగా బిల్లును సైతం తీసుకొస్తోన్నామని అన్నారు. మహిళలు, యువతులకు రక్షణ కల్పించే విషయంలో గ్రామస్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Missing: 30,000+ women & girls under YCP rule. Forget Action, Not even a single statement was made by YCP govt.
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2024
But change is here. The NDA promised a Strong Law and Order in AP, and today I am proud of the @VjaCityPolice Special Task Force for cracking these cases. My hearty… https://t.co/FFM7E6UhOx
కాగా పవన్ కల్యాణ్ చేసిన ఈ పోస్ట్‌కు మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విజయవాడ పోలీసుల కృషిని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, వారికి న్యాయాన్ని కల్పించడంలో ఎన్డీఏ ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతకు అద్దం పడుతోందని అన్నారు. చంద్రబాబు డైనమిక్ నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పారు.
Thank you, Sri @PawanKalyan garu, for acknowledging the relentless efforts of the @VjaCityPolice Special Task Force and the endeavours of the state Home Ministry. The successful resolution of these critical cases shows the NDA Government's unwavering commitment to women's safety,… https://t.co/oTr1AY0z4j
— Anitha Vangalapudi (@Anitha_TDP) November 19, 2024
మహిళల అక్రమ రవాణా, తప్పిపోయిన వాళ్లు, సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం వంటి సమస్యలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వంగలపూడి అనిత అన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నామని, రాష్ట్రవ్యాప్తంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications