పల్లెపండుగ రోడ్డు తవ్వేసినవారిపై నాన్ బెయిలబుల్ కేసులు, రికవరీ చర్యలకు పవన్ కళ్యాణ్ ఆదేశం!

ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులకు పట్టం కడుతుంటే ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం సీరియస్ గా ఉంది. తాజాగా తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు.

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.

Deputy CM Pawan Kalyan Orders Strict Action Under Revenue Recovery Act Against Those Damaging Govt Property

వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో తవ్వేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు.

దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!
దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు. అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+