ఏపీలో పరిషత్‌ ఏకగ్రీవాలు యథాతథం- ఎన్నికలు రద్దయినా- ఎస్‌ఈసీ, సర్కార్‌ క్లారిటీ

ఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత గతేడాది ఏకగ్రీవాలు కూడా డోలాయమానంలో పడ్డాయి. హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవాలు కూడా రద్దవుతాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీడియాలో భిన్న కథనాలు రావడంతో ఎస్ఈసీ వర్గాలు దీనిపై స్పందించాయి. హైకోర్టు తీర్పు తాజాగా గత నెల ఒకటో తేదీన విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించిందే అని ఏకగ్రీవాలతో దానికి సంబంధం లేదని తెలిపాయి. అటు ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.

పరిషత్‌ పోరు రద్దు చేసిన హైకోర్టు

పరిషత్‌ పోరు రద్దు చేసిన హైకోర్టు

ఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో గతేడాది మొదలైన పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా రద్దవుతుందా లేక తాజాగా గతనెలలో ఎస్ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ మాత్రమే రద్దవుతుందా అన్న మీమాంస నెలకొంది. హైకోర్టు దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం, ఎస్ఈసీ కూడా బహిరంగంగా స్పందించలేని పరిస్ధితి.

 ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధుల్లో ఆందోళన

ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధుల్లో ఆందోళన

పరిషత్‌ పోరును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో గతేడాది ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధుల్లోనూ ఉత్కంఠ పెరిగింది. హైకోర్టు తీర్పుతో పూర్తిగా ఎన్నికలు రద్దయితే తమ ఏకగ్రీవాల సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరోసారి ఏకగ్రీవాలు చేసుకోవడం అంటే కష్టమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఏకగ్రీవాలైన చోట ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. ఏకగ్రీవమైన చోట ఇలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేసిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరపడం లేదా మళ్లీ ఏకగ్రీవాలకు ప్రయత్నించడం అందరికీ ఇబ్బందిగా మారుతోంది.

ఏకగ్రీవాలపై ఎస్ఈసీ, సర్కార్‌ క్లారిటీ

ఏకగ్రీవాలపై ఎస్ఈసీ, సర్కార్‌ క్లారిటీ


గతేడాది ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా చోట్ల హైకోర్టు తీర్పుతో వచ్చిన ఇబ్బందేమీ లేదని ఎస్ఈసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యథాతథంగా ఉంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. కరోనా అనంతరం మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను మాత్రమే రద్దు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్‌ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా అనంతరం మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను మాత్రమే రద్దు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్‌ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+