అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మగడ్డకు తొలి సక్సెస్‌-పంచాయతీల్లో లక్ష నామినేషన్లు-పనిచేయని ఏకగ్రీవాల ఆఫర్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కారు వర్సెస్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌గా మారిపోయిన పంచాయతీ ఎన్నికల పోరులో తొలిదశ నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నా అంతిమంగా భారీ ఎత్తున అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. ప్రభుత్వం ఏకగ్రీవాలకు తాయిలాలు ఆశచూపినా అభ్యర్ధులు మాత్రం పోటీకే మొగ్గుచూపారు. దీంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా నామినేషన్లకు అడ్డంకులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ తొలిదశలో సక్సెస్‌ అయినట్లే కనిపిస్తోంది.

పంచాయతీ పోరులో నిమ్మగడ్డ సక్సెస్‌

పంచాయతీ పోరులో నిమ్మగడ్డ సక్సెస్‌


ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో ముఖాముఖీ పోరు జరిపి విజయవంతమైన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఇప్పుడు సర్కారు ఆశచూపిన ఏకగ్రీవాల ఆఫర్‌ను కాదన ఎన్నికల నామినేషన్లు వేయించే విషయంలోనూ సక్సెస్‌ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లను అధికార పార్టీ అడ్డుకోకుండా చేసేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించిన నిమ్మగడ్డ.. తొలిదశలో మంచి స్పందన వచ్చేలా చేయగలిగారు. దీంతో తొలిదశలో నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ వివరాలను ఎస్‌ఈసీ ఇవాళ ఉదయం వెల్లడించింది.

అన్నీ కలిపి లక్ష నామినేషన్లు

అన్నీ కలిపి లక్ష నామినేషన్లు

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనట్లు ఎస్ఈసీ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అన్ని జిల్లాల్లో సర్పంచ్‌ పదవులకు ఈ మూడు రోజుల్లో మొత్తం 19 వేల 491 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డు మెంబర్‌ పదవులకు మూడు రోజుల్లో 79 వేల 799 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే సర్పంచ్‌, వార్డు మెంబర్‌ పదవులకు కలిపి మొత్తం దాదాపు లక్ష నామినేషన్లు దాఖలయ్యాయి.

పనిచేయని జగన్ సర్కార్‌ ఏకగ్రీవాల ఆఫర్‌

పనిచేయని జగన్ సర్కార్‌ ఏకగ్రీవాల ఆఫర్‌

ఈ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఏకగ్రీవాలు చేయాలని జగన్ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆఫర్లు ప్రకటించింది. అయితే అప్పటికే పంచాయతీరాజ్‌ చట్టంలో ఉన్న ఈ ఆఫర్‌ గురించి పంచాయతీల్లో ముందుగానే అవగాహన ఉండటం, దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉఁడబోదని అభ్యర్ధులు పంచాయతీలు భావించడంతో పలు చోట్ల వేలం పాటల్లోనే పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల మాత్రం అభ్యర్ధులు నామినేషన్లకే మొగ్గు చూపారు. తద్వారా సర్కారు ప్రకటించిన ఆఫర్‌కు ఆదరణ దక్కలేదని అర్ధమవుతోంది.

Recommended Video

Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates
ఫలించిన నిమ్మగడ్డ వ్యూహం

ఫలించిన నిమ్మగడ్డ వ్యూహం

ఏపీ పంచాయతీ పోరులో ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రత్యేకంగా ప్రోత్సహించడాన్ని ముందునుంచీ తప్పుబడుతున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ వీటికి కౌంటర్‌గా షాడో టీమ్‌లను రంగంలోకి దించారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీల్లో అభ్యర్ధులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్దాయిలో సిబ్బంది శ్రమించారు. ఏకగ్రీవాల కంటే ఎన్నికలు జరిగితేనే మంచిదన్న మేసేజ్‌ను జనంలోకి పంపారు. దీని ప్రభావంతో దాదాపు లక్ష నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పవచ్చు. ఈ విషయంలో నిమ్మగడ్డ నియమించుకున్న అదనపు డీజీ సంజయ్‌తో పాటు జిల్లా కలెక్టర్లు కూడా విజయవంతంగా పనచేసినట్లు తెలుస్తోంది.

English summary
andhra pradesh state election commission have announced that there is a huge number of nominations filed for first phase panchayat elections in the state despite state govt's incentives for unanimous.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X