హెచ్చరిక: సెప్టెంబరు 1 వరకు భారీగా రైళ్ల రద్దు

దేశవ్యాప్తంగా రైల్వే భద్రతా పరమైన పనులకు మొదటి ప్రాధాన్యతనిస్తోంది. గతేడాది ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 300కు పైగా ప్రయాణికులు అసువులు బాశారు. దేశంలో మరోసారి ఈ తరహా దుర్ఘటనలు చోటుచేసుకోకూడదన్న ఉద్దేశంతో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. దేశంలోని అన్ని జోన్లు, డివిజన్ల పరిధిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

విజయవాడ, హైదరాబాద్, గుంతకల్లు డివిజన్ల పరిధిలో ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు రద్దయిన రైళ్ల వివరాలు

Details of canceled trains till September 1 in Guntakal Railway Division

షాలిమార్‌-హైదరాబాద్‌ (18045)
పూరీ-ఓఖా (20819)
ఓఖా-పూరీ (20820)
నిజాముద్దీన్‌- విశాఖపట్నం(12804)
ఛత్రపతి శివాజీ టెర్మినల్‌-భువనేశ్వర్‌ (11019)

నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ (12787)
నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ (12788)
మచిలీపట్నం-బీదర్‌ (12749)
బీదర్‌-మచిలీపట్నం (12750)
హైదరాబాద్‌-షాలిమార్‌ (18046)
షిర్డీ సాయినగర్‌-కాకినాడ పోర్టు (17205)
కాకినాడ పోర్ట్‌-షిర్డీ సాయినగర్‌ (17206)

భువనేశ్వర్‌ -ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ (11020)
యశ్వంత్‌పూర్‌-టాటా (18112)
టాటా-యశ్వంత్‌పూర్‌ (18111)
హైదరాబాద్‌-తాంబరం (12760)

గుంతకల్‌-బీదర్‌ (07671) ఆగస్టు 1-31 వరకు,
కాచిగూడ-గుంతకల్‌ (07670) ఆగస్టు 2-సెప్టెంబర్‌ 1
కాచిగూడ-రాయచూర్‌ (17693) ఆగస్టు 1-31 వరకు రద్దయ్యాయి.

కొన్ని నెలలుగా విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్లలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో తీవ్రస్థాయిలో రైళ్లు రద్దవుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానమైన రైళ్లను కూడా రద్దుచేస్తుండటంతో ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసినట్లు ప్రకటించినప్పటికీ తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని అధికారులు వెనక్కి తీసుకున్నారు. విజయవాడ-గూడూరు మధ్య మూడోలైను నిర్మాణ పనులు జరుగుతుండటంవల్ల కూడా రైళ్లు ఎక్కువ సంఖ్యలో రద్దవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+