దేవరగట్టు కర్రలసమరంలో పగిలిన తలలు: 100మందికి పైగా గాయాలు; ఒకరు మృతి!

దేవరగట్టు కర్రల సమరం ప్రతీ ఏడాది కర్నూలు జిల్లా ప్రజలకు ఆనవాయితీగా కొనసాగుతున్నా, కర్రల సమరంలో రక్తం చిందుతోంది. దేవరగట్టు బన్నీ ఉత్సవం ఎప్పుడు జరిగినా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం కూడా దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరం మరోమారు రక్తాన్ని చిందించింది. బన్నీ ఉత్సవం పేరుతో సాగిన కర్రల సమరం 100 మందికి పైగా జనాలను గాయాలపాలు చేసింది.

దేవరగట్టులో జరిగే కర్రల సమరంలో ఈ సంవత్సరం ఒకరు మృతి చెందారు. మృతుడు ఆలూరుకు చెందిన పోతరాజు అనే వ్యక్తిగా గుర్తించారు. దీంతో దేవరగట్టు కర్రల సమరంలో విషాదం మిగిలింది.ఈ సంవత్సరం దేవరగట్టు ఉత్సవానికి 11 గ్రామాల నుండి స్థానికులతో పాటు, రెండు లక్షల మంది హాజరయ్యారు. దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి విగ్రహం కోసం రెండు వర్గాలకు చెందిన వారు వేలాదిమంది కర్రల సమరం చేస్తారు. స్వామివారిని తీసుకు వెళ్లడం కోసం ఇరువర్గాలు కర్రలతో కొట్టుకుంటారు.

Devaragattu bunny festival The stick-fighting ritual held at Devaragattu one dead 100 above injured

సాంప్రదాయ ఉత్సవం పేరుతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటారు. ఇందులో భాగంగా ఇనుప రింగులు ఉన్న కర్రలతో బన్నీ ఉత్సవం మొదలు కాగా, ఆ సమయంలో కొందరు కాగడాల దివిటీలను గాలిలోకి తిప్పారు. అర్దరాత్రి దాటిన తర్వాత ఘర్షణ మొదలైంది. కర్రలతో తలలు పగలగొట్టుకున్నారు.అప్పుడు జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయపడ్డారు.

ఇక సాంప్రదాయ ఉత్సవం హింసాత్మకంగా మారడంతో ఈ ఉత్సవాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. అయినప్పటికీ అనాదిగా సంప్రదాయ ఉత్సవంలో భాగంగా తాము కర్రల సమరం చేస్తున్నామని, ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టేది లేదని దేవరగట్టు వాసులు తేల్చిచెప్పారు. అయితే దేవరగట్టు కర్రల సమరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అది విఫల యత్నం అవుతోంది.

కల్చరల్ కార్నివాల్ తో ఆకట్టుకునేలా ఇన్వెస్ట్ తెలంగాణా గ్లోబల్ సమ్మిట్!
కల్చరల్ కార్నివాల్ తో ఆకట్టుకునేలా ఇన్వెస్ట్ తెలంగాణా గ్లోబల్ సమ్మిట్!

ఇక తాజాగా నిన్న దసరా రోజు జరిగిన కర్రల సమరంలో హింసాత్మక ధోరణి చోటుచేసుకుంది. కర్రల సమరంలో భాగంగా కొట్టుకున్న ఇరు వర్గాలకు చెందిన వారి తలలు పగిలాయి. దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తమైంది. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. కాగా ఈ ఘటనలో గాయపడిన భక్తులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి,ఆలూరు ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+