పిఆర్పీ కంటే తక్కువే: జగన్‌పై దేవినేని, గడువుపై జానా
హైదరాబాద్/విజయవాడ: రానున్న ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 2009 ఎన్నికల్లో నాటి ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్ల కంటే తక్కువే వస్తాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సభలో చర్చించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భయపడి పారిపోతుందని విమర్శించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్‌ల కొత్త పార్టీ ప్రచారం కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే అన్నారు. సోనియా ఆదేశాలతోనే సీమాంధ్ర ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని విమర్శించారు.

సమన్యాయం అంటే సమైక్య రాష్ట్రమని టిడిపి సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి కర్నూలులో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్ జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారన్నారు. రాష్ట్రాన్ని విభజించి పాలించు అనే దృష్టితోనే కెసిఆర్, జగన్ ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు టిడిపి కృషి చేస్తోందన్నారు.
గడువుపై జానా రెడ్డి నో
2014 సార్వత్రిక ఎన్నికలలోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి వేరుగా అన్నారు. ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సవరణలు అడిగే హక్కు ఎవరికీ లేదన్నారు. సవరించాలని అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమే ఉందన్నారు. సవరణ పూర్తి హక్కు పార్లమెంటుకే ఉందన్నారు. బిల్లు పైన చర్చకు గడువు పొడిగింపు అంశంపై స్పందిస్తూ.. వారు గడువు కోరితే ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు.
బిల్లు పైన సవరణలు కోరే హక్కు ఎవరికీ లేదని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్ జిల్లాలో అన్నారు. సభను అడ్డుకొంటూ ఇప్పుడు రాష్ట్రపతిని గడువు కోరాలనుకోవడం సరికాదన్నారు. సభలో ఓటింగ్ జరిగే అవకాశమే లేదన్నారు. సవరణలు చేసే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందన్నారు. పొన్నం వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన డిజిపి టి బిల్లును తగులబెడితే ఎందుకు స్పందించడం లేదన్నారు. సీమాంధ్ర నేతలు తెనాలి రామకృష్ణుడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
సొంత జిల్లాకే
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే ఆయన సొంత జిల్లాకే పరిమితం అవుతారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెసు సీనియర్ నేత మధుయాష్కీ ఎద్దేవా చేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications